English | Telugu

ఈ ముగ్గురిలో మెహ‌బూబ్ ఎవ‌ర్ని కిస్ చేశాడు?‌

'దిల్ సే' మెహ‌బూబ్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారింది. అత‌ని ఆశ‌ల‌పై నీళ్లు చిల‌క‌రించేశాడు ఓంకార్‌. అవును. ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌ను ఎదురుగా నిలబెట్టి వాళ్ల‌లో ఎవ‌ర్ని హ‌గ్ చేసుకుంటావ్‌? ఎవ‌ర్ని ముద్దు పెట్టుకుంటావ్ అని ఆశ‌పెట్టి, ఆ వెంట‌నే ఆ ఛాన్స్ ఇయ్య‌న‌ని చెప్పేశాడు. దీంతో అవాక్క‌వ‌డం మెహ‌బూబ్ వంత‌యింది. ఈ స‌ర‌దా స‌న్నివేశం 'కామెడీ స్టార్స్' లేటెస్ట్ ఎపిసోడ్‌లో చోటు చేసుకుంది.

మా టీవీలో ప్ర‌సార‌మ‌వుతోన్న న‌వ్వుల షో 'కామెడీ స్టార్స్‌'కు ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మెహ‌బూబ్ పాల్గొన్నాడు. త‌న అదిరే డాన్స్ మూవ్‌మెంట్స్‌తో ఓ ప‌ర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. ఆ త‌ర్వాత అత‌డిని ఎదురుగా కూర్చొని వున్న ముగ్గురు ముద్దుగుమ్మ‌లు జోర్దార్ సుజాత‌, అషు రెడ్డి, సిరి హ‌న్మంత్‌ల‌ను చూపించి, "హ‌గ్ చేసుకోవాల‌నుకుంటే ముగ్గురిలో ఎవ‌ర్ని హ‌గ్ చేసుకుంటావ్? ముద్దు పెట్టుకోవాల‌నుకుంటే ముగ్గురిలో ఎవ‌ర్ని ముద్దు పెట్టుకుంటావ్?" అని ప్ర‌శ్నించాడు ఓంకార్‌. దీంతో ముగ్గుర‌మ్మాయిలూ కొంత ఆందోళ‌న‌గా, కొంత ఆస‌క్తిగా, ఇంకొంత షాకింగ్‌గా మెహ‌బూబ్ ఏం చెప్తాడా? అని చూశారు.

మెహ‌బూబ్ సిగ్గుప‌డుతూ, "హ‌గ్గు, ముద్దు అంటే భ‌య‌మేస్తంది" అని నవ్వుతూ చెప్పాడు. దాంతో అమ్మాయిలు ముగ్గురూ గ‌ట్టిగా న‌వ్వేశారు. అంత‌లోనే ఓంకార్ ట్విస్ట్ ఇచ్చాడు. "చెప్ప‌డం వ‌ర‌కే.. చెయ్య‌డం లేదు" అని చెప్పాడు. అది విన‌గానే "హా" అని నోరు తెరిచి షాకైన‌ట్లు పోజిచ్చాడు మెహ‌బూబ్‌. ఓంకార్ ఇచ్చిన ట్విస్ట్, మెహ‌బూబ్ రియాక్ష‌న్ చూసి జ‌డ్జి స్థానంలో ఉన్న శేఖ‌ర్ మాస్ట‌ర్ స‌హా అంద‌రూ గ‌ట్టిగా న‌వ్వేశారు. రేపు ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ఈ ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.