English | Telugu
సోహైల్ వచ్చాడంటే కథ వేరే ఉంటది!
Updated : Dec 11, 2022
ఆలీతో సరదాగా షో ప్రతీ వారం సరికొత్తగా అలరిస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. వారంవారం కొత్తకొత్త గెస్ట్ లతో వినోదాన్ని పంచుతూ ఉంటుంది ఈ షో. ఇక ఈ నెక్స్ట్ వీక్ షోకి యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రాళ్ళు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సోహెల్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన సోహెల్.. సింగర్ గా క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ ఇద్దరూ తమ జీవితంలో పడిన కష్టాలను , కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఈ షోలో చర్చించారు.
బిగ్ బాస్ తర్వాత సోహెల్ హీరోగా సినిమాలు చేస్తుండగా.. రాహుల్ సినిమా పాటలతో పాటు బిజినెస్ లో మంచి సక్సెస్ సాధిస్తున్నాడు. అయితే.. హోస్ట్ ఆలీ.. “ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళావంట కదా.. ఎందుకు?” అని సోహెల్ ని అడిగాడు. దీంతో ఎమోషనల్ అయిన సోహెల్.. ‘ఎందుకంటే సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆ టైములో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఏం చేసినా సెట్ అయితలేదు ఇంతేనా లైఫ్’ అని అనిపించిందని చెప్పుకొచ్చాడు.