English | Telugu

Karthika Deepam2: రొమాన్స్ లో కార్తీక్ బాబు, దీపక్క.. ఒకరిపై ఒకరు పడి మరీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2)..ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-292లో.. శివనారాయణ, సుమిత్ర, దశరథ్, పారిజాతంలు జ్యోత్స్న భవిష్యత్ గురించే మాట్లాడుకుంటారు. జ్యోత్స్నను ఇండియాలో ఉండకూడదు.. ఏ అమెరికానో పంపించేయండి అంటూ పారిజాతం సలహా ఇస్తుంది. అయితే దశరథ్‌కి అది ఇష్టం ఉండదు. దాసు పూర్తిగా కోలుకుని నిజం ఏంటో తెలిసే వరకూ జ్యోత్స్న ఇక్కడే ఉండాలని మనసులో అనుకుంటాడు. శివనారాయణ బాధగా.. సరే ఇవన్నీ కాదు దాని తల్లిదండ్రులుగా మీరిద్దరూ ఏం అంటారో చెప్పండి అని సుమిత్ర, దశరథ్‌లతో అంటాడు. వద్దు నాన్నా.. మనం ఉంటేనే ఇలా ఉంటుంది అంటే.. మనం కళ్లముందు లేకుంటే ఇంకెలా తయారవుతుందో కదా అంటూ దశరథ్ అంటాడు. ఇంతలో జ్యోత్స్న వస్తుంది. మళ్లీ పెళ్లి గురించి గొడవ జరుగుతుంది. నీ పెళ్లి చేస్తానని మీ అమ్మకు మాటిచ్చాను.. నీ పెళ్లి చేసే నేను చస్తానని శివనారాయణ ఫైనల్‌గా చెప్పి వెళ్లిపోవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

ఇక సుమిత్ర కూడా బాధతో లోపలికి వెళ్లిపోతుంది. వెంటనే జ్యోని దశరథ్ ప్రేమగా పిలిచి.. పక్కనే కూర్చోబెట్టుకుని..జ్యోత్స్న ఏదొకరోజుకి నువ్వు పెళ్లి అయితే చేసుకోవాలి కదా.. ఎప్పటికైనా ఇవే పరిస్థితులు ఉంటాయి. ఏది మారదు.. అందుకే నువ్వే మారి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమ్మా.. మమ్మల్ని ఇంకా బాధపెట్టకు.. దాసు కోలుకోగానే నీకు పెళ్లి చేస్తామని దశరథ్ అనగా.. జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. దాసు కోలుకోవడానికి దీని పెళ్లికి సంబంధం ఏంటి దశరథా అని అంటుంది. నా తమ్ముడు పెళ్లిలో లేకుండా నేను నా కూతురు పెళ్లి ఎలా చేస్తాను పిన్నీ అని దశరథ్ అనగా.. దశరథ్ కి డౌట్ ఉందని జ్యోత్స్నకి అర్థమవుతుంది. మరోవైపు దీప భాదపడుతుంటే కార్తీక్ వస్తాడు. దీప.. మన సత్యరాజ్ గారికి కాల్ చేసి రెస్టారెంట్ అప్‌డేట్స్ అన్నీ ఇచ్చాను.. చాలా హ్యాపీ ఫీలయ్యారు.. ఎక్కడికే వెళ్తున్నారట. వచ్చాక కలుస్తా అన్నారని అంటాడు. సరే బాబు అంటూ తన ఆలోచనల్లో తాను ఉంటుంది దీప. అదేంటి ఇంత హ్యాపీ న్యూస్ చెబితే చెప్పింది చాల్లే వెళ్లు అన్నట్లు సర్లే బాబు అంటావ్ అని కార్తీక్ అంటాడు. ఇక వాళ్ళ గురించి ఆలోచించకు మన గురించి ఆలోచించమని కార్తీక్ అనగా... ఏదో అనాలనుకుంటున్నారు అదేంటో చెప్పండని దీప అంటుంది. సరే అయితే ముందు నువ్వు ఇలా కూర్చో అని కార్తీక్ అంటాడు. తను మంచం మీద కూర్చుని. చెప్పండి కార్తీక్ బాబు అంటుంది. చెప్పండి బాబు ఫర్వాలేదని దీప అంటుంది. వెంటనే కార్తీక్ కూర్చో అన్నట్లుగా చేయి పట్టుకుని లాగుతాడు. అదుపు తప్పిన దీప.. కార్తీక్ మీద పడిపోతుంది. ఇద్దరు కలిసి మంచం మీద పడిపోవడంతో.. నీ శ్వాసే నను తాకగా అంటూ పాట మొదలైపోతుంది. ఇక రొమాంటిక్ లుక్స్, రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇటు దీప, అటు కార్తీక్ హీటెక్కించారు.

ఇక దీప కాస్త తేరుకుని కార్తీక్ మీద నుంచి పైకి లేచి.. నిలబడుతుంది. సారీ దీపా బలమైన మనిషివి కదా అని కాస్త బలంగా లాగానని కార్తీక్ అంటాడు. ఆదమరుపులో ఉన్నాను కదా.. అందుకే పట్టానని దీప అంటుంది. పడింది మొగుడు మీదే కదా ఫర్వాలేదులే అని కార్తీక్ అంటాడు. హా.. ఏదో చెబుతాను అన్నారని దీప అంటుంది. కష్టసుఖాలు మాట్లాడాలి ముందు నువ్వు ఇలా కూర్చోమని దీపను మళ్లీ ప్రేమగా ఎదురుగా కూర్చోబెట్టుకుని..చేయి నొప్పి వస్తుంది. కాస్త నొక్కుతావా అంటాడు. ఇక మళ్లీ మొదలవుతుంది రొమాంటిక్ సీన్. దీప నొక్కుతుంటే కార్తీక్.. దీప కళ్లల్లోకి చూడటం.. అబ్బో.. మామూలుగా లేదు. ఇక కార్తీక్ దీప కళ్లల్లోకి కొంటెగా చూస్తూ.. కాసేపు మనం అన్నీ పక్కన పెట్టి భార్యభర్తల్లా మాట్లాడుకుందామా అని కార్తీక్ అంటాడు. దీప గుండెల్లో జల్లుమంటుంది. కార్తీక్ చేతిని దీప నొక్కుతుంటే అతడి చేయి దీప తొడ మీదకు ఆనుకుంటుంది. మళ్లీ మరో రొమాంటిక్ సాంగ్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.