English | Telugu

Karthika Deepam 2 : కాశీ రాకతో గందరగోళం.. వాళ్ళిద్దరి పెళ్ళిని కార్తీక్ చేయగలడా!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -138 లో....శ్రీధర్ స్వప్నకి పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. దాంతో నన్ను ఇంత మోసం చేస్తావా మమ్మీ అని స్వప్న అనుకుంటుంది. నేనొక సారి అబ్బాయితో మాట్లాడుతనని స్వప్న అనగానే.. శ్రీధర్ సరే అని అబ్బాయిని పంపిస్తాడు. స్వప్న దగ్గరికి ఆ అబ్బాయి వచ్చాక.. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్న అని ఫోటో చూపించిగానే.. అతని పేరు కాశీ.. నాకు తెలుసని అతను అంటాడు. నువ్వు అతన్ని ప్రేమించావు.. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా పదా ముహూర్తం గురించి తెలుసుకుందామని అబ్బాయి అంటాడు. నాకు ఇప్పుడు విషయం అర్థమైంది.. ఇప్పుడు కాశీకి చెప్పి.. మేం నిర్ణయం తీసుకోవాలని స్వప్న అనుకొని.. కాశీకి ఫోన్ చేస్తుంది.. కానీ కలవదు.

ఆ తర్వాత కార్తీక్ కాశీ గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే శౌర్య వచ్చి కార్తీక్ తో మాట్లాడుతుంది. అప్పుడే కాశీ కూడా వస్తాడు. నిన్ను ఏమని పిలవాలని కాశీతో శౌర్య అనగానే.. దీపక్క అని పిలుస్తాను. కాబట్టి నువ్వు నన్ను మావయ్య అని పిలవమని కాశీ అంటాడు. ఈ విషయం అందరికి చెప్తానంటూ శౌర్య హ్యాపీగా వెళ్తుంది. కార్తీక్ తో బావ అంటు కాశీ మాట్లాడతాడు. బావ అంటే మీకు ఒకే కదా అని కాశీ అడుగుతాడు. వరుస కూడా అదే అవుతుంది కదా అని కార్తీక్ అంటాడు. మీరు నేను తెలియనప్పుడే హెల్ప్ చేశారు.. ఇప్పుడు నాకు బంధువులు అవుతారు.. మీ పెళ్లిలో అన్ని పనులు నేనే చూసుకుంటా బావ అని కాశీ అంటాడు. మా పెళ్లి బాధ్యత కూడా మొత్తం మీరే చూసుకోవాలని కాశీ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర దాస్ కి కాఫీ తీసుకొని వస్తుంది. మీ మంచితనం మీ కూతురికి రాలేదు వదినా.. మీ గుణం మీ పెంపకంలో లేదని దాస్ సుమిత్రతో జ్యోత్స్న గురించి మాట్లాడతాడు. ఆ మాటలు పారిజాతం వింటుంది. పారిజాతం చాటుగా వినడం శౌర్య చూస్తుంది. శౌర్య విందేమో అని పారిజాతం టెన్షన్ పడుతూ.. శౌర్యని ఎవరికి చెప్పాకూ అంటూ బుజ్జగిస్తుంటే.. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఏంటని అడుగగా.. మా అమ్మమ్మ , తాత మాట్లాడుకుంటుంటే చాటుగా వింటుంది.‌ తప్పు కదా అని శౌర్య అనగానే.. ఛీ నీకు బుద్ది రాదంటూ శివన్నయారాయణ పారిజాతాన్ని తిడతాడు.

ఆ తర్వాత కార్తీక్ కి స్వప్న ఫోన్ చేసి.. విషయం చెప్తుంది. నాకు ఇప్పుడు చావు తప్ప.. వేరే లేదనగానే.. నేను మీ పెళ్లి చేస్తానని కార్తీక్ మాటిస్తాడు. ఆ తర్వాత శౌర్య వచ్చి కార్తీక్ ఫోన్ నుండి దీపకి చేస్తుంది. దీప లిఫ్ట్ చెయ్యదు. శౌర్య వెళ్తుంది. జ్యోత్స్న వస్తుంటే కార్తీక్ కి తల నొప్పి డిస్టబ్ చెయ్యకనగానే శౌర్యపై జ్యోత్స్న కోప్పడుతుంది. కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి నాతో మాట్లాడడం లేదని అడుగుతుంది. నన్ను కాసేపు వదిలేయమని కార్తీక్ అంటాడు. అప్పుడే దీప ఫోన్ చేస్తుంది. కార్తీక్ చెప్పండి అని దీప అనగానే.. నాతో మాట్లాడ్డం వీలు కాదు.. దీపతో మాట్లాడుతావా అని జ్యోత్స్న అనుకుంటుంది. నేను ఫోన్ చెయ్యలేదు శౌర్య చేసిందని కార్తీక్ అంటాడు‌. ఒక విషయం చెప్పాలి త్వరగా రండి అని కార్తీక్ అనగానే.. నేనొక విషయం చెప్పాలి ఇంటికి వచ్చాక చెప్తానని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.