English | Telugu

రీతూ నా మరదలు ..నాన్నకి కాన్సర్..ఆ సింపతిని అడ్డుపెట్టుకోవాలని అనుకోలేదు

బిగ్ బాస్ హౌస్ లో డెమోన్ పవన్, రీతూ చౌదరి అల్లరి గురించి తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళు బిబి జోడిలో కూడా కలిసి డాన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇక డీమన్ పవన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. "నిజానికి నాకు మరదలు లేదు. కానీ రీతూ నాకు మరదలి లెక్క. బిగ్ బాస్ హౌస్ లో అలాగే ఉన్నాను. అందుకే బావమరదళ్ళ సరదాలు ముచ్చట్లు అవన్నీ ఉన్నాయి మా మధ్యన. అందుకే రాముని నేను బామ్మర్ది అన్నాను. బయటకు వచ్చాక అలాగే ఉంటారా అని చాలామంది అడిగారు.

నిజానికి బయటకు వచ్చాక ఒక్క గొడవ కూడా మాకు అవలేదు. హౌస్ లో మా బాండ్ జెన్యూన్ కాబట్టి బయటకు వచ్చాక కూడా అలాగే ఉన్నాం. నాకు రీతూ ఒక మెంటార్ లా కూడా. షూట్స్ విషయంలో సీనియర్ కాబట్టి అలా చెయ్యి ఇలా చెయ్యి అని సలహాలు ఇస్తుంది. ఐతే బిగ్ బాస్ నుంచి వచ్చాక ఇంకా నాకు రెమ్యూనరేషన్ పడలేదు. ఒకవేళ పడితే నేను మా బ్రదర్ కి మా బావగారికి ఇవ్వాలి. వాళ్ళు నా కోసం 10 లక్షల వరకు స్పెండ్ చేశారు. బిగ్ బాస్ అగ్నిపరీక్షకు వచ్చే ముందే నాన్నను టంగ్ కాన్సర్ ఉందని తెలిసింది. ట్రీట్మెంట్ చేయించాం. సక్సెస్ అయ్యింది. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి నేను సింపతీ మీద మా డాడీని అడ్డుపెట్టుకుని వెళ్లాలని అనుకోలేదు.

మా డాడీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాకే అందరికీ తెలిసింది. మా నాన్న ఎవరికీ ఎప్పుడూ ఏమీ హాని చేయలేదు. నాతో జోవియల్ గా ఉండేవాళ్ళు. అలా కస్టపడి పైకొచ్చిన నాన్నకు ఇలా వచ్చిందేంటా అనుకున్న. ఆయన మంచితనమే నాకూ వచ్చింది. నాకు వచ్చే ప్రొపోజల్స్ కూడా నాన్నకు చెప్పేస్తాను. అందుకే జనాలు కూడా నన్ను థర్డ్ పొజిషన్ లో పెట్టారు. నేను కొంచెం గ్రో అయ్యాను." అంటూ చెప్పుకొచ్చాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.