English | Telugu

అదిరిపోయిన గుప్పెడంత మనసు సీరియల్ క్లైమాక్స్.. తండ్రీకొడుకులు ఒక్కటయ్యారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1168 లో..... వసుధారకి మను ఫోన్ చేసి.. మేడమ్ ఎక్కడున్నారని అడుగుతాడు. మహేంద్ర సర్ ని ఆ శైలేంద్ర కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తున్నాడు. మీరు రండీ నేను కార్ ని ఫాలో అవుతున్నానని మను అనగానే.. ఇప్పుడు మేం వచ్చే పరిస్థితిలో లేము.. శైలేంద్ర గురించి మావయ్యకి తెలిసి కోపంగా మమ్మల్ని లోపల ఉంచి బయట తాళం వేశారని వసుధార అనగానే.. సరే నేను చూసుకుంటా మీరు టెన్షన్ పడకండని మను చెప్తాడు. ఏంటని రిషి అడుగగా.. మావయ్యని శైలేంద్ర కిడ్నాప్ చేసాడట అని వసుధార చెప్తుంది. (Guppedantha Manasu climax)

ఆ తర్వాత అనుపమకి మను ఫోన్ చేసి విషయం చెప్పగానే.. రిషి, వసుధారల దగ్గరికి అనుపమ వెళ్లి తాళం పగులగొడుతుంది. మరొకవైపు మహేంద్రని కిడ్నాప్ చేసిన చోటు దగ్గరికి మను వెళ్లి వీడియో తీస్తాడు. మహేంద్రని చంపబోతుంటే అప్పుడే మను వెళ్లి రౌడీలని కొడతాడు. ఆ తర్వాత రిషి హీరోలా ఎంట్రీ ఇచ్చి ఇద్దరు కలిసి రౌడీలని కొడుతారు. తండ్రి తో పాటు ఇద్దరు కొడుకులు మీసం తిప్పుతారు. మహేంద్రని ఎలా కాపాడామో శైలేంద్రకి చెప్తాడు రిషి. అదంతా విని శైలేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత దేవయానితో రిషి మాట్లాడతాడు. మేమ్ ఏం చేసాం పెద్దమ్మ అంటూ రిషి ఎమోషనల్ అవుతాడు. తల్లి లాగా చూసాను ఇలా చేశారు.. మీకు ఎండీ పదవి ఇస్తాను.. నా తల్లిని ఇస్తారా అంటు రిషి అడుగుతాడు. దాంతో తప్పు చేశానని దేవయాని రిషి కాళ్ళపై పడబోతుంటే రిషి ఆపుతాడు. ఆ తర్వాత మీకు కావల్సింది ఆస్తులు కదా తీసుకోండి అంటూ పేపర్స్ ఇస్తాడు. కానీ కాలేజీ మాత్రం ఇవ్వను ఎందుకంటే ఎంతో మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఉంది అనగానే.. నాకు పదవి కావాలని శైలేంద్ర అంటాడు. ఇంత జరిగాక మిమ్మల్ని బ్రతకనివ్వనని శైలేంద్ర గన్ తీసి రిషికి గురి పెడతాడు. రిషికి అడ్డుగా వసుధార వెళ్తుంది. వాళ్లిద్దరికి అడ్డుగా దేవయాని వెళ్తుంది. ఇన్ని రోజులు చేసిన తప్పులు చాలని శైలేంద్రతో దేవయాని అంటుంది.

ఆ తర్వాత నాకు శిక్ష పడాలి అంటు గన్ తో శైలేంద్ర కాల్చుకోబోతుంటే.. రిషి అడ్డుపడతాడు. నీకు నేను శిక్ష వేస్తానని రిషి అంటాడు. ఆ తర్వాత కాలేజీ లో మీటింగ్ జరుగుతుంది. అందులో అందరికి శైలేంద్ర టీ, కాఫీలు ఇస్తాడు. శైలేంద్రకి రిషి వేసిన శిక్ష అతడిని ప్యూన్ చేయడం.. ఎప్పటికైన ఎండీ అవుతానని శైలంద్ర అంటాడు. అప్పుడే మహేంద్రకి మను ఫోన్ చేసి.. సర్ ఫారెన్ వెళ్తున్నానని అంటాడు ఎక్కడికి వద్దు ఏంజిల్ రెడీగా ఉంది.. పెళ్లి చెయ్యడానికి ముహూర్తం పెట్టడానికి వస్తున్నామని, నీ పెళ్లి బాధ్యత నాదే అని మహేంద్ర అంటాడు. సర్ అని మను అనగానే.. సర్ ఏంటి డాడ్ అనమని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ఏంటి సర్ అంటు రిషి పక్కకి వెళ్తుంది వసుధార. ఏంటంటే శైలేంద్ర కూడా చూస్తుంటే నీకు ఎందుకురా అంటు ఫణీంద్ర కోప్పడతాడు. దాంతో అందరూ నవ్వుకుంటారు. వసుధార, రిషిలపై శుభంకార్డు పడుతుంది. గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.