English | Telugu

Guppedantha Manasu : శైలేంద్రని కలవనున్న సరోజ.. క్లైమాక్స్ ఎలా ఉందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1161 లో.. మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు? అని వసుధార అంటే.. అవును వసుధార.. రిషి అనేవాడికి మా అన్నయ్య గురించి పూర్తిగా తెలియదు.. కానీ రంగాకి అన్నయ్య నిజస్వరూపం మొత్తం తెలుసని అంటాడు. ఆ మాటతో వసుధార ఆశ్చర్యంగా చూస్తుంది. దాంతో రిషి.. ఏంటి వసుధారా.. కన్ఫ్యూజన్‌గా ఉందా?? చెప్పాను కదా.. నిన్ను కొన్నిరోజులు కన్ఫ్యూజన్‌లో ఉంచుతానని.. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా.. నేను రిషిలా చేయలేని పనులు రంగాగా చేయగలను కాబట్టే ఇంకా ఆ పాత్ర పోషిస్తున్నాను. ఇప్పుడు కూడా ఆ పాత్రలో నేను చక్కబెట్టాల్సిన పనులు చాలానే ఉన్నాయి. అవి రంగాగానే చేస్తానని అంటాడు.

ఇంకెన్నాళ్లు సర్.. ఈ ముసుగు అని వసుధార అంటే.. కథ ముగింపుకి వచ్చేసరికి క్యారెక్టర్లు బయటపడతాయి కదా.. ఆ సమయం దగ్గరలోనే ఉంది.. చూస్తూనే ఉండమని రిషి అంటాడు. ఇక రిషి చూడమన్నాడు కాబట్టి.. వసుధార అలా శూన్యంలోకి చూస్తుంటుంది. నేను చూడమన్నది శూన్యంలోకి కాదు వసుధారా.. ఆ నక్షత్రాలను చూడమని వసుధారకి చుక్కలు చూపిస్తాడు వసుధార. మరోవైపు బుజ్జిని సరోజ కలుస్తుంది. ఆ వసుధార మా బావని తీసుకెళ్ళిందా అని సరోజ అడుగగా.. లేదు రంగానే వసుధారని తీసుకెళ్ళాడని బుజ్జి చెప్తాడు.దాన్ని కనిపెట్టాలి.. మనం వెళ్లి శైలేంద్రని కలిస్తే అన్నీ తెలుస్తాయి. ముందు నేను వెళ్లి శైలేంద్రని కలవాలని సరోజ బయల్దేరుతుంది. కాసేపటికి బుజ్జి దగ్గరకి రిషి వస్తాడు. నానమ్మ నీపై బెంగపెట్టుకుందన్నా.. మందులు కూడా వేసుకోవడం లేదు. ఆ సరోజ అయితే ఆరాలు తీస్తుంది.. అంతా నువ్వు చెప్పినట్టే చేశా కానీ.. ఆ సరోజ శైలేంద్రని కలుస్తుంది అని చెప్తాడు బుజ్జిగాడు. దాంతో రిషి.. సరోజ వెళ్లి ఆ శైలేంద్రని కలవాలి.. కలిసేట్టు నువ్వు చెయ్ అని రిషి అంటాడు. అయితే వీళ్ల మాటల్ని వసుధార చాటుగా వింటూ ఉంటుంది. రిషి సర్ ఏం చేయబోతున్నారు? ఎందుకు శైలేంద్రని సరోజ కలిసేట్టు చేస్తున్నారని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇంతలో బుజ్జిగాడు.. రిషి వైపు అనుమానంగా చూసి.. అన్నా నువ్వు రంగావి కాదు కదా అని అడుగుతాడు.

నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదురా.. ఎక్కువ ఊహించుకోకు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడొద్దని రిషి అంటాడు. మాట్లాడొద్దని అంటున్నావంటే.. అదే నిజం కదా.. ముసల్ది నీపై ప్రాణం పెట్టుకుంది అన్నా.. ప్లీజ్ అన్నా.. నిజం చెప్పు.. నేను ఎవరికీ నిజం చెప్పనని బుజ్జి రిక్వెస్ట్ చేయగా.. నేను తరువాత మాట్లాడతాను.. నానమ్మ జాగ్రత్త అని సమాధానం దాటవేస్తాడు. ఇతను రిషి అయితే మా రంగా ఎక్కడున్నాడని బుజ్జి ఆలోచనలో పడతాడు. ఎక్కువ ఆలోచించకురా బుజ్జి.. నువ్వు ప్రశాంతంగా వెళ్లమని బుజ్జిని అక్కడ నుంచి పంపించేస్తాడు రిషి. అయితే అసలు రిషినా? రంగానా? అని అనుమానంలో వసుధార ఉండిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.