English | Telugu

Brahmamudi : కావ్య కోసం ఆఫీస్ కి వెళ్ళిన రాజ్.. టెన్షన్ లో యామిని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -688 లో.....స్వప్న, అప్పు ఇద్దరు రుద్రాణిని ప్రాంక్ చేస్తారు. రుద్రాణి భోజనానికి వచ్చేసరికి టేబుల్ పై లైవ్ ఫిష్ ఉంటుంది. అది చూసి రుద్రాణి భయపడుతుంది. ఇదేంటీ లైవ్ ఫిష్ ఉంది వండలేదా అని రుద్రాణి అనగానే మీకు ఎక్కడ కన్పిస్తుంది అక్కడ కర్రీ ఉంది కదా అని స్వప్న, అప్పు అంటారు. చికెన్ కూడా పచ్చిగానే ఉంది బంగాళాదుంప కూడా వండలేదు అలాగే పెట్టారని రుద్రాణి అంటుంది. అక్కడ అన్ని కర్రీస్ ఉన్నాయ్ మీకెందుకు అలా అనిపిస్తుందని అప్పు, స్వప్న యాక్టింగ్ చేస్తారు.

మీరు నన్ను పిచ్చి దాన్ని చేస్తున్నారా.. ఎందుకు అలా అంటున్నారు.. ఇక్కడే ఉండండి, అంటూ రుద్రాణి వెళ్ళి ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరిని తీసుకొని వచ్చి అక్కడ చూడండి వండకుండా పచ్చివి పెట్టారు కానీ వాళ్ళు కర్రీస్ అంటున్నారని చెప్పగానే ప్రకాష్ ఓపెన్ చేసేసరికి కర్రీస్ ఉంటాయి. నీకు ఏమైనా మైండ్ పని చెయ్యడం లేదా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అవి కర్రీస్ అని ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. కానీ వాళ్ళు వచ్చేలోపే స్వప్న, అప్పు మారుస్తారు. మరొకవైపు కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. అపర్ణ ఫోన్ లిఫ్ట్ చేయబోతుంటే కావ్య వెళ్లి లిఫ్ట్ చేసి పక్కకి వచ్చి మాట్లాడుతుంది చాలా సేపు ఫోన్ మాట్లాడుకుంటారు.

మరొకవైపు రాహుల్ టీనా కోసం వెతికి వెతికి ఫోన్ చేస్తాడు. స్వప్న లిఫ్ట్ చేసి నేను అడ్రెస్ చెప్తుంటాను నువ్వు రా అని అంటుంది. తీరా చుస్తే రాహుల్ తన ఇంటికి వస్తాడు. ఎదరుగా స్వప్న చీపురుకట్టతో రెడీగా ఉంటుంది. నీకు పెళ్ళాం పిల్లలున్నా కూడా టీనా అంటూ తిరుగుతున్నావంటూ కొడుతుంది. అప్పుడే రుద్రాణి వస్తుంది అందరు ఇంట్లో నన్ను పిచ్చి దానిలాగా చూస్తున్నారని రుద్రాణి అంటుంది.

తరువాయి భాగం లో రాజ్ బయటకు వెళ్తాడు. రాజ్ వెళ్తున్న కార్ లో జీపీఎస్ పెట్టాను తను ఎక్కడికి వెళ్లిన తెలుస్తుందని తన పేరెంట్స్ తో యామిని చెప్తుంది. కావ్య కోసం ఆఫీస్ కి వెళ్తాడు రాజ్. ఏంటి వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాడు.. తనని గుర్తు పడుతారు కదా అని యామిని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.