English | Telugu

Brahmamudi: కూతరు కోసం మాట మార్చుకున్న యామిని తండ్రి.. రాజ్, కావ్య కలుస్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-684లో.. రాజ్, కావ్య కలుద్దామని అనుకుంటారు. ఆ సమయంలోనే యామిని వాళ్ళ నాన్న దగ్గరికి రాజ్ వస్తాడు. అంకుల్ నా జీవితంలో ఇంకెవరినైనా నేను మిస్ అవుతున్నానా.. అంతకముందు నా గతంలో ఇంకెవరైనా ఉన్నారా.. అని అడిగినప్పుడు యామినీ తండ్రి నిజం చెప్పబోతాడు కానీ వైదేహి అడ్డుపడి.. ఎవరుంటారు బాబు.. యామినీతోనే నువ్వు ఎక్కువ తిరిగే వాడివి.. ఎక్కువగా ఉండేవాడివి. మాకు తెలియకుండా ఎవరుంటారని అబద్దం చెప్పి కవర్ చేస్తుంది. ఆ తర్వాత భర్తవైపు కోపంగా చూసిన వైదేహి‌.. నిజం చెప్పబోయాడని యామినీతో చెప్తుంది.

ఏంటి డాడీ ఇది.. నా లైఫ్‌ని ఏం చెయ్యాలి అనుకుంటున్నావ్.. నేను ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడ్డానో తెలిసి కూడా నాకే ద్రోహం చెయ్యాలనుకుంటున్నావా అని యామినీ రెచ్చిపోతుంది. నేను నీ తండ్రిని బేబీ.. నీకు నేను ద్రోహం చేస్తానా అని అతను అంటాడు. మరి రామ్ అలా అడగ్గానే కావ్య గురించి ఎందుకు చెప్పాలనుకున్నావని అంటుంది. రాజ్ అలా బాధపడుతుంటే అని యామినీ తండ్రి చెప్తాడు. రాజ్ కాదు రామ్.. గుర్తు పెట్టుకో డాడీ.. రాజ్ కాదు రామ్ అంటూ అరుస్తుంది. అదే బేబీ.. అబ్బాయి వచ్చి నా ముందు అలా బాధపడుతూ అడుగుతుంటే ఏదో తప్పు చేసినా ఫీలింగ్ వచ్చింది. భార్యభర్తలను విడదీయడం పాపమనిపించింది. తనకు గతం గుర్తులేకపోయినా కావ్యను చూడగానే ఏదో తెలిసిన మనిషిలా ఫీల్ అవుతున్నాడంటే తన భార్యను ఎంతగా ప్రేమించి ఉండాలి. అందుకే గిల్టీగా అనిపించి అని యామినీ తండ్రి నసుగుతుంటే.. నిజం చెప్పేద్దామనుకున్నావ్ అంతే కదా.. రామ్ కళ్లల్లో ప్రేమని చూశావ్.. మరి నా పరిస్థితి నీకు కనిపించడం లేదా అని యామిని కోప్పడుతుంది. వెంటనే ఆవేశంగా చుట్టూ చూసి కత్తి చేత్తో పట్టుకుని.. డాడీ.. నా ప్రేమను అర్థం చేసుకోకపోయినా.. నా రామ్‌ని నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నించినా.. వాళ్లను నేను క్షమించనంటూ యామిని ఊగిపోతుంది. బేబీ ఏం చేస్తున్నావ్ నువ్వు.. ఆయన మీ నాన్నా అని వైదేహి అంటుంది. కంగారు పడకు మమ్మీ.. తండ్రిని చంపేంత శాడిజం నాలో లేదు.. కానీ రామ్ దక్కకపోతే నన్ను నేను చంపుకోవడానికి కూడా అసలు ఆలోచించనని యామిని అంటుంది. నాకంటే ఆ రాజ్, కావ్యల ప్రేమే ఎక్కువ అనుకుంటున్నారుగా.. నన్ను చావనివ్వండి అని యామినీ అంటుండగా.. వెంటనే యామినీ తండ్రి ఆవేశంగా యామినీ చేతిలోని కత్తిలాక్కుని కిందపడేస్తాడు.

నాకు నా కూతురుకంటే ఏది ఎక్కువ కాదు బేబీ అని అరుస్తాడు. వెంటనే యామినీ ముఖంలో నవ్వు వస్తుంది. అవును బేబీ.. నీ తర్వాతే ఎవరైనా.. నీ మీద ఒట్టు.. రామ్‌తోనే నీ పెళ్లి అనేసి యామినీ తలపై ఒట్టు వేస్తాడు. దాంతో యామినీ సైకోలా నవ్వుకుంటుంది. మరోవైపు రేపు ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి.. ఏం అడగాలి?’ అని రాజ్ తపిస్తుంటే.. రేపు ఆయన ఏం అడుగుతారు.. ఏం మాట్లాడతారని కావ్య ఆలోచిస్తుంది. ఇక తెల్లారి రాజ్ రెడీ అయిపోయి మెల్లగా ఇంట్లోంచి జారుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ యామినీ తండ్రి, తల్లి రాజ్‌ని చూసి ఎక్కడికి బాబు అని అడుగుతారు.

యామినీ ఏది ఆంటీ అని రాజ్ అడుగగా.. ఇంకా లేవేలేదు బాబు అని వైదేహీ అంటుంది. హమ్మయ్యా.. అని మనసులో అనుకున్న రాజ్.. నిన్నటి నుంచి మనసు ఏదోలా ఉంది ఆంటీ.. అమ్మ నాన్న గుర్తొచ్చారని అంటాడు. యామిని తల్లి షాక్ అవుతుంది. కాసేపు వెళ్లి సమాధుల దగ్గర కూర్చుని వచ్చేస్తానని రాజ్ అనగానే.. గతం గుర్తు రాలేదులే అని యామిని పేరెంట్స్ కూల్ అవుతారు. ఇక మరోవైపు కావ్య అందంగా రెడీ అయ్యి, మల్లెపూలు పెట్టుకుని ఆఫీస్‌కి వెళ్లొస్తానని అబద్దం చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేర్తుంది. అయితే కావ్య అబద్దం చెప్పిందేమోనని రాజ్ దగ్గరకు వెళ్తుందేమోననే అనుమానంతో రుద్రాణీ, రాహుల్ మరో కారులో కావ్యను ఫాలో చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.