English | Telugu

Brahmamudi : భార్యపై ప్రేమతో అలా చేసిన భర్త.. బ్రహ్మముడి ఇదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -814 లో.... కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. నువ్వు అనుకున్నది సాధించావ్ కళావతి. నన్ను నీ ప్రేమలో పడేసావని కావ్యపై ఉన్న ప్రేమని చెప్తాడు రాజ్. నీ ప్రేమ ఎప్పటికి నాకు కావాలి.. అలా కావాలంటే ఇప్పుడేం చేయాలి.. నీ కాళ్ళు పట్టుకోనా అని రాజ్ అనగానే అయ్యో వద్దండీ అని రాజ్ ని కావ్య హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కావ్య పైకి వెళ్తుంటే రాజ్ వెళ్లకని అడ్డుపడతాడు.

ఎందుకు నన్ను వద్దంటున్నారని కావ్య అడుగుతుంది. అంటే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా నువ్వు మెట్లు ఎక్కకూడదని రాజ్ అంటాడు. అయితే ఏం చేస్తారు. నేను రోజుకి ఎన్నిసార్లు పైకి కిందకి వెళ్తానో తెలుసా అని కావ్య అంటుంది. అలా వద్దని చెప్తున్నానని కావ్యని ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు రాజ్. అదంతా అప్పు, కళ్యాణ్ చూస్తారు. నన్ను కూడా ఎత్తుకొని తీసుకొని వెళ్ళండి అని అప్పు అనగానే కళ్యాణ్ ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత రోజు ఇలా ఎత్తుకొని తీసుకొని వెళ్ళడం కష్టం దీనికి పరిష్కారం ఆలోచించాలని రాజ్, కళ్యాణ్ అనుకొని ఇద్దరి పేరెంట్స్ ని పిలిచి బ్యాగ్ లతో సహా హాల్లో నిల్చోపెడతారు. మీరు ఇక నుండి పైకి వెళ్ళాలి.. మేమ్ కింద ఉంటామని రాజ్ కళ్యాణ్ అంటారు.

సడెన్ గా ఏంటిది ఇదంతా కావ్య ప్లాన్ అయి ఉంటుందని అపర్ణ అంటుంది. నేను పంతులిని అడిగాను.. వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా వాళ్ళు కింద ఉండాలి.. పెద్దవాళ్ళు పైన ఉండాలని చెప్పారని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో మనం ఇన్ని బాధలు పడడానికి కారణం ఆ యామిని అని రాజ్ కి కావ్త చెప్పగానే రాజ్ కోపంగా యామిని దగ్గరికి వెళ్తాడు. రాజ్ యామినిపై కోప్పడుతుంటే.. నన్ను క్షమించు రాజ్ అని రాజ్ కాళ్లపై పడుతుంది యామిని. మా యాక్సిడెంట్ కి కారణం నువ్వేనని తెలిస్తే మాత్రం నిన్ను నీ ఫ్యామిలీని ఏం చేస్తానో తెలియదని రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.