English | Telugu

అనుకు ఆర్య వ‌ర్ధ‌న్ చెప్పిన ర‌హ‌స్యం ఏంటీ?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. రేటింగ్ ప‌రంగానూ దూసుకుపోతోంది. స‌రికొత్త క‌థ క‌థ‌నాల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం ఎండింగ్ ద‌శ‌కు చేరుకుంది. ఇందులో శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, అనుషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి, జ్యోతిరెడ్డి త‌దిత‌రులు న‌టించారు.

ఆర్య వ‌ర్ధ‌న్ అనుభ‌విస్తున్న ఆస్తి మొత్తం త‌న అక్క రాజ‌నందినిదేన‌ని, అయితే ఆ ఆస్తిని త‌న‌కు రాసి ఇచ్చింద‌ని రాగ‌సుధ ఫోర్జ‌రీ చేసిన డాక్యుమెంట్ లు చూపించి ఆర్య‌ను ఇర‌కాటంలో పెడుతుంది. అయితే వాటి ఆధారంగా ఆస్తి రాగ‌సుధ‌కే చెందుతుంద‌ని తీర్పు ఇచ్చే స‌మ‌యంలో ఆర్య వ‌ర్ధ‌న్ త‌రుపు లాయ‌ర్ నా క్లైంట్ కి చివ‌ర‌గా ఒక్క అవ‌కాశం ఇవ్వండ‌ని, త‌గిన ఆధారాల‌తో నిరూపిస్తామ‌ని కోర‌తాడు. దీనికి న్యాయ‌మూర్తి ఓకే అంటాడు.

నెల రోజుల గ‌డువు కోరితే ఆర్య మాత్రం జ‌స్ట్ వ‌న్ డే చాలంటాడు. త‌ను కోరిన ప్ర‌కార‌మే ఒక్క రోజు గ‌డువు ఇస్తాడు. క‌ట్ చేస్తే బ‌స్తీ వాసులు ఆర్య‌ని మ‌ళ్లీ క‌స్ట‌డీకి అంగీక‌రించేది లేదంటూ పోలీస్టేష్ ఎదుట ఆందోళ‌న‌కు దిగుతారు. సుబ్బు చెప్పినా ప‌ట్టించుకోకుండా స్టేష‌న్ ని చుట్టుముడ‌తారు. దీంతో అక్క‌డికి వ‌చ్చిన ఆర్య ఆశ్చ‌ర్య‌పోతాడు. ద‌య‌చేసి శాంతించండి అని చెబుతాడు. అయినా విన‌క‌పోవ‌డంతో అను వ‌చ్చి స‌ర్ధి చెబుతుంది. ఇదే స‌మ‌యంలో ఆర్య‌ని కాపాడుకోలేక‌పోతున్నాన‌ని కుమిలిపోతుంది. నేను మీకు త‌గ‌ను, మ‌ళ్లీ బ‌స్తీకే వెళ్లిపోతాను అంటుంది. అప్పుడు అనుకు ఆర్య ఓ ర‌హ‌స్యం చెబుతాడు. వెంట‌నే ఇంటికి వెళ్లిన అను.. హ‌త్య చేయ‌డానికి మార‌నాయుధం..తో పాటు మ‌రి కొన్ని ప్రాప‌ర్టీస్ కావాల‌ని నీర‌జ్ తో అంటంది. అది విని నీర‌జ్ తో పాటు ఆర్య త‌ల్లి ఆర్చ‌ర్య‌పోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Anu to Execute a Masterplan,Prema Entha Maduram Serial Today episode,Prema Entha Maduram ,Anu,Arya Vardhan,Raga Sudha

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.