English | Telugu

వర్షంలో భర్తతో కలిసి అనసూయ ఆటలు...

అనసూయ ఏది చేసిన వింతగానే ఉంటుంది. ఆమె కామెంట్స్ కానీ ఆమె పోస్టులు కానీ అందరినీ తనవైపు తిప్పుకునేలానే ఉంటాయి. రీసెంట్ గా అనసూయ ఒక పోస్ట్ పెట్టింది. వర్షంలో తన భర్తతో కలిసి బాడ్మింటన్ ఆడుతూ కనిపించింది.

ఆమె షార్ట్ జీన్స్ లో టీ షర్ట్ లో కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె స్టైలిష్ లుక్ లో అందరినీ మెస్మోరైజ్ చేస్తూ కనిపించింది. ఇలాంటి పిక్స్ పెట్టగానే ఎలాంటి కామెంట్స్ వస్తాయో అందరికీ తెలుసు కదా. అనసూయ కూడా అదే పెట్టింది. "వాళ్లేమంటారంటే ఈవిడేంటి ప్రతీ విషయాన్ని పోస్ట్ చేయాలా అని అంటారు. ఐతే నేను ఏమంటానంటే మా మధ్య ఇలాంటి విషయాలు కూడా జరుగుతాయని అందరికీ తెలియడం కోసం..మా మధ్య కూడా ఇలాంటి అందమైన క్షణాలు, నిజమైన ప్రేమ ఉన్నాయని చెప్పడం కోసం. ఇంకోటేంటంటే ఇలాంటి మెమోరీస్ దాచుకోవడం కోసం కూడా" అని పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే "ఇక్కడ వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరేమో వర్షంలో బాడ్మింటన్ ఆడుతున్నారు." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అనసూయ 'పుష్ప 2'తో పాటు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. అలాగే అనసూయ ఇతర భాషల చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అనసూయ తన కెరీర్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫామిలీ ఫొటోస్ ని తన ఇంట్లో పెంచుకునే పక్షుల ఫొటోస్ ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.