English | Telugu

'ఢీ' షో అనేది మాహిష్మతి సామ్రాజ్యం..అందులో బాహుబలి ప్రభుదేవా!

ఢీ-15 ఛాంపియన్ బ్యాటిల్ చాలా జోష్ గా స్టార్ట్ అయ్యింది. ఈ షోలో "డి" ఫర్ "దేవా" అంటూ ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్సర్స్ ఐన గణేష్, జానీ, నోబెల్, శ్రీధర్  అలాగే మిగతా డాన్స్ మాస్టర్స్ తో కలిసి స్టెప్పులేసి స్టేజి మీదకు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఢీ- 14 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు గ్రాండ్ గా 15 సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ షో. 

ఇక ఈ షో హోస్ట్ ప్రదీప్ మాట్లాడుతూ "ఇంటికి పెద్దన్నయ్య వచ్చినట్లు ఉంది..మీరే కొబ్బరికాయ కొట్టి ఈ షోని స్టార్ట్ చేశారు. మళ్ళీ మీ రాజ్యానికి రాజుగా వచ్చేసారు. ఢీ షో అనేది మాహిష్మతి సామ్రాజ్యం ఐతే అందులో బాహుబలి మీరే అనేసరికి ప్రభుదేవా కూడా తన సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ వస్తోంది అన్నారు..నా పొలంలో కూడా ఇంత పెద్ద పెద్ద మొలకలొచ్చాయి. తమిళనాడు వెళ్తే హీరో అవుతాను, బొంబాయికి వెళ్తే డైరెక్టర్ అవుతాను, ఆంధ్రాకి వస్తే కొరియోగ్రాఫర్ ని ఐపోతాను. మల్లెమాల వారికి ధన్యవాదాలు. 

ఇక్కడున్న డాన్సర్స్  చాలా డెంజరస్. వాళ్ళతో  నేను పోటీ పడలేను. హమ్మయ్య నేను ముందే వచ్చేశాను. అందుకే ఇక్కడ కూర్చోబెట్టారు.  నా తర్వాతే మీరంతా పుట్టినందుకు చాలా థాంక్స్' అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. కొరియోగ్రాఫర్స్ అందరినీ పేరుపేరునా పిలిచి విషెస్ చెప్పారు. "శేఖర్ మాస్టర్ ని మిస్ అవుతున్నా. నాకు తెలుగు సాంగ్స్ అంటే చాలా ఇష్టం"  అని చెప్పి అందరినీ ఆయన మాటలతో మెస్మోరైజ్ చేశారు.