English | Telugu
ఇరగ్గొట్టేసారు మేడం.. మీకు ఇంకా పిల్లలు ఎందుకు లేరు!
Updated : Jan 29, 2026
ఆట 2 .0 గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది. "వెల్కమ్ టు ఆట..ఈసారి డాన్స్ రప్ప రప్ప రప్పా" అంటూ మాస్ లుక్ లో హోస్ట్ సుధీర్ ఇంట్రడక్షన్ ఇచ్చేసాడు. జడ్జెస్ కూడా చాలా గట్టివాళ్లనే తీసుకొచ్చారు. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్. మెగా ప్రిన్సెస్ నిహారిక, మాస్ కా బాస్ రాధికా శరత్ కుమార్ వంటి వాళ్లంతా స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో అదిరిపోయే స్టెప్స్ వేస్తూ వచ్చారు. "ఇరగ్గొట్టేసారు మేడం అసలా" అంటూ సుధీర్ రాధికను అనేసరికి "మీకు ఎంత మంది పిల్లలు" అని ఆవిడ అడిగారు. "మేడం నాకు ఇంకా పెళ్ళవలేదు" అన్నాడు సుధీర్. "అయ్యో దేవుడా ప్రాబ్లమ్ ఏంటి" అని అడిగారు రాధికా. దాంతో సుధీర్ నోరెళ్లబెట్టాడు జానీ మాష్టర్, నిహారిక నవ్వుకున్నారు.
ఇక సమీరా భరద్వాజ్ వచ్చి "మిమ్మల్ని చూస్తుంటే నాకో సాంగ్ గుర్తొస్తోంది..ఉరకలై గోదావరి " అంటూ రాధికా మీద పాట అందుకోవడంతో సుధీర్ బ్రేక్ వేసి ఇది ఆట పాట కాదు అన్నాడు. "ఎంత మంది ప్లేయర్స్ వచ్చినా ఈ ఆట టైటిల్ గెలిచేది మేమె" అంటూ చెప్పింది సమీరా. ఇక ఈ షో జీ తెలుగులో ఫిబ్రవరి 7 శనివారం రాత్రి 9 గంటలకు స్టార్ట్ కాబోతోంది.