భారతీయత ముందు డెబ్భై ఏళ్ళు,నూట యాభై మంది డాన్సర్లు నథింగ్ అంటున్న రేఖ
ఒకప్పటి బాలీవుడ్ అందాల భామ, ప్రముఖ హీరోయిన్ రేఖ(rekha)నట ప్రస్థానం గురించి భారతీయ సినీ ప్రేమికులందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తే నేను కాలేజీ చదివే రోజుల్లో నా కళల రాణి రేఖ గారని, బహుశా నా శ్రీమతి సురేఖ లో రేఖ అనే పేరు కూడా ఉందనే పెళ్ళికి ఒప్పుకున్నానేమో అని కూడా చెప్పాడంటే రేఖ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు.