English | Telugu
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించిన ఎఫ్.ఎన్.సి.సి.!
Updated : Sep 26, 2024
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇటీవల భారీ వర్షాల వల్ల వరదలు రావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు పొంగడంతో భారీ నష్టం వాటిల్లింది. అయితే వరద బాధితుల సహాయార్ధం ఇప్పటికే పలు రంగాల ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఎఫ్.ఎన్.సి.సి. తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడుని కలిసి రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు ప్రెసిడెంట్ జి.ఆదిశేషగిరిరావు, సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు.
ప్రెసిడెంట్ జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ‘ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ ఎఫ్.ఎన్.సి.సి. సహాయ కార్యక్రమాలలో ముందుంటుంది’ అన్నారు. సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్‌లోగాని, తెలంగాణలో గాని ఎలాంటి విపత్తు వచ్చినా ఎఫ్.ఎన్.సి.సి. తరఫున సహాయం గతంలో చేసాం. ఇప్పుడైనా, ఎప్పుడైనా సహాయం చేయడానికి ముందుంటాం’ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుని కలిసి రూ.25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్‌రెడ్డిని కలిసి రూ.25 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిలిం నగర్ క్లబ్‌కి అండగా నిలబడుతున్నాయి. అందుకుగాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులను రెండు రాష్ట్రాల సీఎంలు అభినందించారు.