English | Telugu

పవన్ కళ్యాణ్ ని యోగి ఆదిత్యనాధ్ తో పోలుస్తున్న కృష్ణవంశీ 

దర్శకుడుగా కృష్ణవంశీ(krishna vamsi)కి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నిన్నే పెళ్లాడుతా దగ్గర్నుంచి రంగ మార్తాండ వరకు ఆయన టచ్ చెయ్యని జోనర్ లేదు.పైగా వాటన్నిటిలోను భారీ హిట్స్ ని అందుకొని సుదీర్ఘ కాలం నుంచి టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతు వస్తున్నాడు.రీసెంట్ గా ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)వన్ మాన్ షో మురారి(murari)రీ రిలీజ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి  కృష్ణవంశీ స్టామినాని మరోసారి అందరికి గుర్తు చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే కృష్ణవంశీ అభిమానులు వేసే ప్రశ్నలకి చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్తుంటాడు.రీసెంట్ గా ఒక అభిమాని ప్రస్తుతం తిరుపతి లడ్డు(tirupati laddu)విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)తీసుకున్న స్టాండ్ గురించి మీ అభిప్రాయమేంటని  అడగగా మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి.పవన్ లాంటి వాళ్ళు మరింత మంది రాజకీయాల్లోకి రావాలి.అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఒక వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు.అందుకు భగవంతుడు ఆయనకి ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజం ఎప్పటికైనా నిజమే.

దానికి ఎవరి అంగీకారం అవసరం లేదు.పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ హీరో అని మరోసారి రుజువయ్యింది.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్(Yogi Adityanath)తర్వాత అంతటి విలువలు, తెలివి తేటలు కల్గిన ప్రత్యేక రాజకీయవేత్త పవన్ అని  చెప్పుకొచ్చాడు.దీంతో పవన్ అభిమానులైతే కృష్ణవంశీ నాలుక మీద మచ్చ ఉంటే బాగుండని కోరుకుంటున్నారు.నాలుక మీద మచ్చ ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు నిజమవుతాయనే నానుడి ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది.