లేనిపోని రచ్చ చేయకండి.. బాలయ్య మాస్ వార్నింగ్!
ఇటీవల భారీ వర్షాలు, వరదలు కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కష్ట కాలంలో రాజకీయాలకతీతంగా ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి.. విపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసందే. ఇవి కృత్రిమ వరదలని, ప్రభుత్వమే వరదలకు కారణమంటూ అర్థంపర్థంలేని ఆరోపణలు చేశారు. ఇప్పటికే జగన్ ని పలువురు తప్పుబట్టారు.