English | Telugu

పుష్ప 2 కి వై ఎస్ జగన్ కి ఉన్న సంబంధం ఏంటి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల పాట్నా లో రిలీజైన ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో మూవీపై అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్స్ లో కూడా వేగం కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే చెన్నై వేదికగా ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా ఒక ఛానల్ డిబేట్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy)ఆంధ్రప్రదేశ్ లోని పవర్ డిస్కంలని అదానీ పవర్ కార్పొరేషన్ కి ఏడూ వేల మెగా వాట్ల విద్యుత్ ఒప్పందం దృష్ట్యా ఇరవై ఐదు సంవత్సరాల పాటు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు కి తాకట్టు పెట్టింది. ఈ ఒప్పందాలని చూపించి అదానీ సంస్థ అమెరికా లోపెద్ద మొత్తంలో నిధులు సేకరించింది.ఇందుకు గాను జగన్ కి ఒక్కో మెగా వాట్ కి ఇరవై ఐదు లక్షల చొప్పున 1750 కోట్ల లంచం.ముట్టింది, ఆ చెల్లింపు వివరాలన్నీ ఎలక్ట్రానిక్ విధానంలోనే  జరగగా అదానీ వాటిని  భద్రంగా సేవ్ చేసుకున్నాడు.ఈ విషయంలో అమెరికా గవర్నమెంట్ అక్కడే కేసు బుక్ చేసింది.

ఇప్పుడు ఈ సంఘటనతో  పుష్ప 2 లో అల్లు అర్జున్ చెప్పినట్టుగా ఎర్రచందం స్మగ్లింగ్ విషయంలో పుష్ప అంటే నేషనల్ అనుకుంటున్నారా, ఇంటెర్నేషనల్ అని చెప్తాడు. ఇప్పుడు జగన్ కూడా అమెరికా కేసు తో  నేను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పినట్టయింది. ఆల్రెడీ జగన్ మీద ఎన్నో  కేసులు ఉన్న విషయం  తెలిసిందే.