English | Telugu

కావ్యని భార్యగా అంగీకరించనని తేల్చిచెప్పేసిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -114 లో.. కనకం డబ్బుల కోసం బీరువా చూస్తుంది. ఎంత వెతికినా డబ్బులు కన్పించకపోవడంతో అప్పుని‌ పిలిచి అడుగుతుంది. అప్పుడు అప్పుకి స్వప్న మేకప్ బాక్స్ కోసం ఇచ్చిన డబ్బులు గుర్తొస్తాయి. అప్పు అవే అనుకొని.. ఆ డబ్బులు ఎవరు తీసారో నాకు తెలుసని స్వప్నని తీసుకొని వచ్చి.. మేకప్ బాక్స్ ఆర్డర్ కి ఇచ్చిన డబ్బులు ఎక్కడివని స్వప్నని అడుగుతుంది అప్పు. మా అమ్మ డబ్బులు అని స్వప్న అనగానే.. నీకు అమ్మ ఎక్కడిదే? నా భర్త కష్టపడి సంపాదించిన డబ్బులు దాచుకుంటే.. నువ్వు ఉపయోగించుకుంటావా అని స్వప్నని తిడుతుంది కనకం. నేను దుగ్గిరాల ఇంటికి కాబోయే కోడలిని ఆ ఇంటికి వెళ్ళాక.. మీకు ఎంత కావాలో అంత ఇచ్చేస్తానని స్వప్న పొగరుగా చెప్పేసి వెళ్ళిపోతుంది.

ముగిసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ...విన్నర్ గా నిలిచిన సౌజన్య

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఐకానిక్ ఫినాలేలో ధూమ్ ధామ్ గా జరిగింది. ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని చెప్పొచ్చు. దాదాపు 12 మంది ఈ పోటీకి అర్హత సాధించగా ఫైనల్ కి ఐదుగురు వచ్చారు. న్యూ జెర్సీకి చెందిన డాక్టర్  శ్రుతి, హైద‌రాబాద్‌ నుంచి  జ‌య‌రాం, కార్తీక్,  సిద్ధిపేట నుంచి లాస్య ప్రియ‌, విశాఖ‌ప‌ట్నం నుంచి సౌజ‌న్య భాగవతుల ఫైనల్స్ కి వచ్చారు. ఫైనల్ ఎపిసోడ్ లో టైటిల్ విన్నర్ గా సౌజన్య ట్రోఫీని సొంతం చేసుకుంది. ట్రోఫీని అల్లు అర్జున్, గీతామాధురి, కార్తీక్, థమన్ అందించారు. "సౌజన్య నీకు ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన పేరెంట్స్ మనకు ఎలాగో సపోర్ట్ చేస్తారు. కానీ భర్త, అత్తగారు, మావగారు సపోర్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు ఇప్పుడు చాల మందికి ఇన్స్పిరేషన్ వి అవుతావు" అని చెప్పారు అల్లు అర్జున్. అలాగే 10 లక్షల చెక్కుని కూడా అందించారు.

సిక్స్త్ సెన్స్ లో కామన్ సెన్స్ తో పాటు రొమాన్స్ కూడా ఉండడం గ్రేట్

సిక్స్త్ సెన్స్ సీజన్ 6 లో ఈ వారం జెడి. చక్రవర్తి చాల ఫన్ క్రియేట్ చేసాడు. అలాగే ఎగ్ బ్రేక్ చేసే టాస్క్ లో ఓంకార్ జెడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. "మీరు మీ కెరీర్ లో ఏ హీరోయిన్ ని ఐనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారా ?" అని ఓంకార్ అడిగాడు "మా నాన్న మీదొట్టు...అందరినీ ట్రై చేశా." పడనివాళ్ళు ఏవారైనా ఉన్నారా అని మళ్ళీ అడిగాడు.. "ఇంప్రెస్ చేయడం  వేరు, పడేయడం  వేరు..రెండు వేరు వేరు సబ్జక్ట్స్...ఐ ట్రై టు ఇంప్రెస్  ఎవ్రీ వన్ అండ్ ఎనీవన్ . పడేయడం అంటే సెకండ్ సబ్జెక్టు...ఫస్ట్ సబ్జెక్టు గురించి మాట్లాడితే...సుస్మితాసేన్ ఫస్ట్ చెప్పుకోవాలి...ఎందుకంటే ఆమెకు తెలుగు రాదు కాబట్టి ధైర్యంగా చెప్పా.."మీ కెరీర్ లో మీరు చూసిన వాళ్ళల్లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు" అని అడిగాడు.

 డైలాగ్ రైటర్ గా ఈ మూవీ టైటిల్ కార్డు మీద నా పేరు పడింది

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో ఫుల్ జోష్ గా కలర్ ఫుల్ గా సాగిపోయింది. ఈ షోకి "బూటకట్ బాలరాజు" మూవీ టీం నుంచి డైలాగ్ రైటర్స్ ఆటో రాంప్రసాద్, రాకేష్, సోహైల్, మేఘలేఖ, సిరి హన్మంత్, ఇంద్రజ, బాబు, డైరెక్టర్ శ్రీ కోనేటి, కమెడియన్ బాబు వచ్చారు. స్టేజి మీదకు టీం రాగానే "ఇక్కడికి రామ్ ప్రసాద్ గారు ఎందుకొచ్చారు" అని రష్మీ అడగడంతో "ఈ షోకి ఇప్పుడు నేను కూడా గెస్ట్ గా వచ్చాను...కొంచెం వేల్యూ ఇవ్వరా.." అని రాంప్రసాద్ చెప్పడంతో "మీరు చెప్పండి ఈ రాంప్రసాద్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు" అని డైరెక్టర్ ని అడిగింది రష్మీ " ఈ మూవీలో డైలాగ్స్ రాయడానికి ఎంతో హెల్ప్ ఐన పర్సన్."అని చెప్పారు. "డైలాగ్ రైటర్ రాంప్రసాద్ అని ఈ సినిమాతో టైటిల్ కార్డు కూడా వచ్చింది" అని చెప్పేసరికి రష్మీ కంగ్రాట్స్ అని చెప్పింది.