English | Telugu

భార్యతో కలిసి టైటానిక్ పోజ్ ఇచ్చిన యాంకర్ రవి!

బుల్లితెర మీద యాంకర్ రవి గురించి తెలియని వాళ్ళు ఉండరు.. మేల్ యాంకర్స్ లో రవి ఫుల్ ఫేమస్. రవి షోస్, ఇంటర్వ్యూస్, అప్పుడప్పుడు మూవీస్ అవీ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటాడు. తన లేటెస్ట్ అండ్ కమింగ్ అప్ డేట్స్ ని కూడా ఫాన్స్ తో షేర్ చేస్తుంటాడు. అలాంటి రవి ఇప్పుడు తన వైఫ్ నిత్యా, కూతురు వియ, అలాగే నిత్యా వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఒక ప్లేస్ కి వెళ్ళాడు. "కార్డేలియా క్రూజ్" లో తన ఫామిలీతో కలిసి చెన్నై నుంచి శ్రీలంకపై వెళ్ళాడు. ఫస్ట్ టైం క్రూజ్ లో వెళ్తున్నామని చెప్పాడు. హైదరాబాద్  నుంచి చెన్నై వెళ్లి అక్కడినుంచి క్రూజ్ లో వెళ్లారు రవి అండ్ ఫామిలీ.

రాహుల్ రాలేదని రచ్చ చేసి‌న స్వప్న.. రుద్రాణిపై దుగ్గిరాల ఫ్యామిలీ సీరియస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -131 లో.. అప్పుని షాపింగ్ కి తీసుకెళ్తాడు కళ్యాణ్. అలా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరు దుండగులు కత్తితో బెదిరిస్తారు. కత్తిని చూసిన కళ్యాణ్ భయపడతాడు. కానీ అప్పు ఒక దుండగుడిని కొట్టగానే మరొకడు పారిపోతాడు. ఆ తర్వాత అప్పు వాడిని వదిలేసి.. ఇంత భయపడేవాడివి రేపు పొద్దున పెళ్ళి అయ్యాక నీ భార్యని ఎలా చూసుకుంటావని అడుగుతుంది. నేను నీలా పెరగలేదు, చాలా స్మూత్ గా పెరిగానని కళ్యాణ్ అనగా.. సరే రేపటి నుండి గ్రౌండ్ కి వచ్చేయ్ నీకు ట్రైనింగ్ ఇస్తానని అప్పు అంటుంది.

శైలేంద్ర ప్లాన్ ని తిప్పికొట్టిన జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -798లో.. DBST కాలేజ్ బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. అందులో మిషన్ ఎడ్యుకేషన్ లో‌ పనులు‌ సక్రమంగా జరుగట్లేదని, దానిని మనం ఆపేద్దామమని శైలేంద్ర అంటాడు. అక్కడే ఉన్న మరో ముగ్గురు స్టాఫ్ కూడా శైలేంద్రకి అనుకూలంగా ఆపేద్దామని అంటారు. దాంతో అదంతా శైలేంద్ర ప్లాన్ అని తెలుసుకున్న జగతి వారిని ఇక చాలు.. ఆగండని చెప్తుంది. "మీలో ఎవరేం అన్నా.. నేను మిషన్ ఎడ్యుకేషన్ ని సక్రమంగా అమలు చేస్తాను. ఉండాలనుకునువాళ్ళు ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు" అని జగతి చెప్పి వెళ్లిపోతుంది.