English | Telugu

ఇది కాకపోయి ఉంటే టీచర్ ని అయ్యేదాన్ని

బుల్లితెర మీద "కార్తీక దీపం" సీరియల్ లో హిమ రోల్ లో  అమాయకపు అమ్మాయి పాత్రలో నటించింది కీర్తి భట్. ఇప్పుడు "మధురానగరిలో" అనే సీరియల్ లో నటిస్తోంది. కీర్తి భట్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కి ఆమె గురించి బాగా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 6  లో ఆమె తన గురించి మొత్తం చెప్పేసింది. తన జీవితంలో వున్న విషాదాన్ని పంచుకోవడంతో ఆడియన్స్ కి ఆమె ఇంకా బాగా దగ్గరయ్యింది. కీర్తిభట్ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు పిల్లలంటే చాల ఇష్టం కూడా. అలా తన ఫోటో షూట్స్ తో పాటు తన సీరియల్ లో నటించే పిల్లాడితో ఎన్నో ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

గీతికని సపోర్ట్ అడిగిన ముకుంద.. రేవతి కొత్త ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -190 లో.. ముకుంద ఫ్రెండ్ గీతిక ఇంటికి వస్తుంది. గీతికను కృష్ణ చూసి ఎలా ఉన్నావని అడుగుతుంది. ఎలాగైనా ఏసీపీ సర్ డైరీ లో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని కృష్ణ అనుకుంటుంది. నిన్నోకటి అడగాలి గీతికా? చెప్తావా అని కృష్ణ అడుగుతుంది. అడుగు కృష్ణ చెప్తానని గీతిక అనగా.. ఏసీపీ సర్ నీకు ఎప్పటి నుండి తెలుసని కృష్ణ అడుగుతుంది. ఆమ్మో ఇప్పుడు నిజం చెప్తే సిచుయేషన్ ఎలా ఉంటుందోనని అనుకున్న గీతిక.. అబద్దం చెప్పడం బెటర్ అని ముకుంద-ఆదర్శల పెళ్లి అప్పటి నుండి తెలుసని గీతికా అంటుంది. గీతిక ఏదో దాస్తున్నట్లు కృష్ణకి అనిపిస్తుంది. ఆ తర్వాత ముకుంద గదిలోకి గీతిక వెళ్తుంది.

 నీది మంచి మనసు అంటున్న నెటిజన్

ఫైమా గురించి బుల్లితెర మీద తెలియని వారంటూ ఎవరూ లేరు. ఎంతో కష్టపడి ఒక్కో అడుగు వేసుకుంటూ ఎదుగుతూ వస్తోంది. ఆమె కామెడీ టైమింగ్ కి పంచులకు చాలామంది మాస్ ఫాన్స్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా...ఎవరేమన్నా లైట్ తీసుకుంటూ కామెడీ పండించింది. అలాంటి ఫైమా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఫైమా వాళ్ళ అమ్మ ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. బయట గుమ్మంలో చీపురుతో ఊడ్చుకుంటూ ఉండగా ఆమెకు సడెన్గా తల భారంగా అనిపించి తల పెట్టుకొనేసరికి  ఇంతలో ఇంటి లోపల నుంచి వచ్చిన ఫైమా.. వాళ్ళ అమ్మ బాధను గమనించి వెంటనే ఆ పక్కనే ఉన్న అరుగు మీద కూర్చోబెట్టింది.. అలా మొత్తం గుమ్మమంతా ఊడ్చేసి బట్టలు ఉతికి ఆరేసి...వంట చేసి కలిపి ముద్దలు తినిపించింది. దానికి వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది.

అప్పుని అవమానించినందుకు రుద్రాణిపై దుగ్గిరాల ఫ్యామిలీ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసరవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -129 లో... కనకం, మీనాక్షి కలిసి సేటుని రూమ్ లో బంధిస్తారు. ఆ తర్వాత టెన్షన్ పడుతారు. అంతలోనే కృష్ణమూర్తి వస్తాడు. కనకం.. తడబడుతూ మాట్లాడుతుంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని కృష్ణమూర్తి అడుగుతాడు. దాంతో పక్కనే ఉన్న మీనాక్షి కవర్ చేస్తుంది. అంతలోనే అప్పు వస్తుంది. ఈ మామిడి కాయలు తీసుకెళ్లి స్వప్నకి ఇచ్చి రా ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు పుల్లటివి తినాలనిపిస్తుంది కదా అని అప్పుతో కృష్ణమూర్తి  చెప్పి, స్వప్న దగ్గరికి పంపిస్తాడు.

ప్రదీప్ పెళ్లిపై చిన్నారుల కామెంట్స్...కన్నీళ్లు పెట్టుకున్న బాబూమోహన్

డ్రామా జూనియర్స్ సీజన్ 6 లో చిన్నారుల స్కిట్స్ ఇంటిల్లిపాదీ నవ్వుకునేలా ఉన్నాయి. రోల్ నంబర్ 11 లో ఏడేళ్ల ఆదిత్య, తొమ్మిదేళ్ల జస్వంత్ వర్మ ఇద్దరూ వచ్చి స్కిట్ పెర్ఫామ్ చేశారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరి కంబినేషన్ లో ఎన్నో హిట్ మూవీస్ వచ్చాయి. అలా వాళ్ళ ఇద్దరి మధ్య కామెడీ సీన్స్ ఈ చిన్నారులు బాగా పండించారు. అంతేకాదు. ప్రదీప్ పెళ్లి మీద కూడా కామెంట్స్ చేశారు. "నేను ఇలా అన్నానని కాదు. నీకు పెళ్ళికావట్లేదని ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించకు బుచికిబుచికి ..ఎందుకంటే అది ఇప్పట్లో అవ్వదులే " అనేసరికి ప్రదీప్, బాబు మోహన్ నవ్వేశారు. "ఇప్పుడు అవన్నీ ఎందుకు లెండి సర్" అన్నాడు సరదాగా నవ్వుతూ.