Read more!

English | Telugu

షారుఖ్, అట్లీ కాంబినేషన్ లో 'జవాన్'.. రిలీజ్ ఎప్పుడంటే?

సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే రోజులు పోయి ఇండియన్ సినిమా అని చెప్పే రోజులు వచ్చాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.  అందుకు తగ్గట్లే సౌత్, నార్త్ స్టార్లు కలిసి సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ని, రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

షారుఖ్ - అట్లీ కాంబోలో వస్తున్న సినిమాకి 'జవాన్' అనే టైటిల్ పెట్టారు. ఈ మేరకు టైటిల్ ని ప్రకటిస్తూ తాజాగా ఓ వీడియోని విడుదల చేశారు.  అందులో ఒంటినిండా గాయాలు, కట్లతో చేతిలో గన్ పట్టుకొని ఉన్న షారుఖ్ లుక్ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమాని సరిగ్గా ఏడాదికి జూన్ 2, 2023 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.