పవర్ తగ్గిన పవన్ వన్ మ్యాన్ షో
సర్దార్ గబ్బర్‌సింగ్ కథ విషయంలో వవన్ ప్రయోగాలకు పోలేదు. కొత్తదనం జోలికి వెళ్లలేదు. ఫార్ములాకు తగ్గట్టుగానే కథని నడిపి.. తన అభిమానుల్ని అనుక్షణం సంతృప్తి పరచడానికి ప్రయత్నించాడు. ఈ సినిమా తొలి సన్నివేశం నుంచీ పవన్ మోటీవ్ అదే. పవన్ ఇంట్రడక్షన్ ఫైట్, అక్కడ చెప్పిన డైలాగులు, ఆ తరవాత వచ్చే పాట.. ఇవన్నీ అభిమానులకు