జనతా గ్యారేజ్ లో సూపర్ స్టార్ కీలక పాత్ర..!
శ్రీమంతుడు తీసిన కొరటాల శివ, సక్సెస్ మీదున్న ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా కావడంతో, జనతా గ్యారేజ్ పై మంచి అంచనాలున్నాయి. అందుకే ఈ మూవీ టీం ఎక్కడా తగ్గకుండా, భారీ క్యాస్టింగ్, తారాగణంతో సినిమాను సిద్ధం చేస్తున్నారు. మోహన్ లాల్, సాయికుమార్ లాంటి స్టార్స్ ను సినిమాకు తీసుకున్న కొరటాల, తాజాగా ఒక కీలక పాత్రను సూపర్ స్టార్ కృష్ణ చేత చేయించబోతున్నాడట