English | Telugu

‘లైగర్’ బ్యూటీ రిలేషన్ షిప్.. తండ్రి కామెంట్స్

బాలీవుడ్ హీరోయిన్స్ చుట్టూ ల‌వ్ మేట‌ర్స్ ఉండ‌టం అనేది కామ‌న్‌. ఈ వార్త‌ల‌తో వాళ్లు ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతుంటారు. తాజాగా ఆ లిస్టులో చేరిన ముద్దుగుమ్మ అన‌న్య పాండే. కెరీర్ స్టార్టింగ్‌లో మ‌రొక‌రితో ప్రేమాయ‌ణం సాగించిన లైగ‌ర్ బ్యూటీ రీసెంట్‌గా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ క‌పూర్‌తో ప్రేమ‌లో మునిగింది. ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. వారిద్ద‌రికీ సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటారంటూ బాలీవుడ్‌లో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై అన‌న్య పాండే తండ్రి, సీనియ‌ర్ న‌టుడు చంకీ పాండే స్పందించారు.

కింగ్ ఖాన్‌తో ర‌ష్మిక‌.. అస‌లు విష‌య‌మిదే!

శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఓ వైపు సౌత్ సినిమాల‌తో పాటు నార్త్ మూవీ ఇండ‌స్ట్రీపై కూడా క‌న్నేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ‘రెయిన్ బో’ అనే మూవీ చేస్తోంది. ఇది తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోంది. ఇది కాకుండా పాన్ ఇండియా మూవీ పుష్ప 2లోనూ న‌టించాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ఆమె బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌తో క‌లిసి న‌టించింది. అదేంటి ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా కింగ్ ఖాన్‌తో ర‌ష్మిక న‌టించిందా? ఎప్పుడు.. ఎక్క‌డ.. ఏ సినిమాలో? అనే సందేహం రావ‌చ్చు. కానీ వారిద్ద‌ర‌రూ న‌టించింది సినిమాలో కాదు.. యాడ్‌లో. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ను చిత్రీక‌రించారు. దానికి సంబంధించిన క్లిప్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ స‌ద‌రు వాణిజ్య ప్ర‌క‌ట‌న ఏంట‌నేది తెలుసుకోవాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

నా ప‌ని న‌న్ను ప‌రిచ‌యం చేయాలి:  భూమి ఫ‌డ్నేక‌ర్‌

బాలీవుడ్ దివా భూమి ఫ‌డ్నేక‌ర్ ఇచ్చే స్టేట్ మెంట్లు జ‌నాల‌కు ఇన్‌స్ప‌యిరింగ్‌గా ఉంటాయి. వృత్తి ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌, అంకిత‌భావంతో తానేంటో నిరూపించుకున్న న‌టి భూమి ఫ‌డ్నేక‌ర్‌. వ‌ర్క్ మీద ఆమెకున్న ప్యాష‌న్ గురించి ఆమెతో ప‌నిచేసిన వారు డీటైల్డ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. త‌న ప‌నిని తాను ప్రేమించే తీరు, న‌ట‌న ప‌ట్ల త‌న‌కున్న గౌర‌వాన్ని గురించి షేర్ చేసుకున్నారు భూమి ఫ‌డ్నేక‌ర్‌. ``నేను వ‌ర్క్ హాలిక్ ప‌ర్స‌న్‌ని. ఆ నిజం నాకు తెలుసు. నాకు అర్థ‌మైన నిజాన్ని నేను ప్రేమిస్తున్నాను. నాకు నా జీవితంలో ప్ర‌తి క్ష‌ణాన్ని కొత్త‌గా జీవించాల‌ని ఉంటుంది. ఏదో కొత్త‌గా ట్రై చేయాల‌ని ఉంటుంది. యాక్టింగ్ చాలా గొప్ప ప్రొఫెష‌న్‌. దాన్ని తేలిగ్గా తీసుకోకూడ‌దు. నేను ఏ సెట్‌లోకి అడుగుపెట్టినా, ఆ మేక‌ర్స్ కి రుణ‌ప‌డి ఉన్నాన‌ని భావిస్తాను. నా ప‌నికి 200 శాతం న్యాయం చేయ‌డానికి కృషి చేస్తాను`` అని అన్నారు. 

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మొద‌లుపెడుతున్న ఆలియా

ఆలియా భ‌ట్ మెయిన్ లీడ్‌లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్క‌నుంది. వాస‌న్ బాలా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ నుంచి షూటింగ్ మొద‌లుకానుంది. రీసెంట్‌గా ఆమె న‌టించిన రీఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హానీ విడుద‌లైంది. ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించిన చిత్ర‌మిది. ఈ నెల్లో ఆమె ఫ‌స్ట్ హాలీవుడ్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ స్టోన్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. వాస‌న్ సినిమాకు సంబంధించి మేజ‌ర్ పోర్ష‌న్ ముంబైలోనే షూటింగ్ జ‌రుపుకుంటుంది. కొంత భాగాన్ని విదేశాల్లో తెరకెక్కిస్తారు. ఈ సినిమాలోనూ ఆలియా కొన్ని ఇంటెన్స్ యాక్ష‌న్ సీక్వెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓ మామూలు మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి... జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘ‌ట‌న‌ల ద్వారా ఎలా మారిపోయింది అనే క‌థాంశంతో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. 

సంజ‌య్ ద‌త్‌కీ డ్రీమ్ గ‌ర్ల్ 2కీ సంబంధం ఏంటి?

సంజ‌య్‌ద‌త్ ఇప్పుడు డ్రీమ్ గ‌ర్ల్ 2 సినిమాలో న‌టించ‌డం లేదు. కాక‌పోతే ఆ సినిమా తీసిన డైర‌క్ట‌ర్‌తో వ‌ర్క్ చేయ‌డానికి రెడీ అయ్యారు. 2019లో విడుద‌లైంది డ్రీమ్ గ‌ర్ల్ మూవీ. ఈ సినిమాకు రాజ్ శాండిల్య‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ మూవీ స‌క్సెస్ త‌ర్వాత సీక్వెల్ రాసుకున్నారు. ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా, అన్ను క‌పూర్‌, ప‌రేష్ రావ‌ల్‌, విజ‌య్ రాజ్‌, సీమా ప‌హ్వాతో సీక్వెల్‌ని తెర‌కెక్కించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌కి విశేష‌మైన స్పందన వ‌స్తోంది. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న ఓ ఫ్యామిలీ కామెడీ మూవీని తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమాలోనే సంజ‌య్ ద‌త్ మెయిన్ లీడ్ చేయ‌బోతున్నారు. ఈ ఫ్యామిలీ కామెడీ సినిమాను

హిరాణీ మూవీ కావాలంటున్న వ‌రుణ్‌!

బ‌వాల్‌లో ప‌వ‌ర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ చూపించారు బాలీవుడ్ యాక్ట‌ర్ వ‌రుణ్ ధావ‌న్‌. జాన్వీ క‌పూర్‌తో క‌లిసి ఫ‌స్ట్ టైమ్ ప‌నిచేశారు. ద‌ర్శ‌కుడు నితీష్ తివారితోనూ ఆయ‌న‌ది ఫ‌స్ట్ కాంబినేష‌నే. అయినా చాలా మంచి రివ్యూలు వ‌స్తున్నాయి. ఈ సంద‌ర్భంగా ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇచ్చింది టీమ్‌. ప‌లు ర‌కాల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు వ‌రుణ్ ధావ‌న్‌. ``నేను ఇప్ప‌టిదాకా శ్రీరామ్ రాఘ‌వ‌న్‌, సూజిత్ సిర్కార్‌, నితీష్ తివారిలాంటివారితో ప‌నిచేశాను. నెక్స్ట్ నా బ‌కెట్ లిస్టులో అట్లీ ఉన్నారు. ఎప్ప‌టి నుంచో అట్లీతో ప‌నిచేయాల‌ని ఉంది. అయితే ఆయ‌న నిర్మాణంలో ప‌నిచేస్తుండ‌టం ఆనందంగా ఉంది. ఏదో ఒక ర‌కంగా ఆయ‌న‌తో కొలాబ‌రేట్ అవుతున్నాను. ఒక‌వేళ రాజ్‌కుమార్ హిరాణీతో ప‌నిచేసే అవ‌కాశం వ‌స్తే, నా క‌ల నిజ‌మైన‌ట్టే. ఆ రోజు నిజంగా హ్యాపీగా ఫీల‌వుతాను`` అని అన్నారు.