English | Telugu

తాలి సో స్పెష‌ల్ అంటున్న సుష్మిత‌

డిజిట‌ల్‌లో సుష్మిత సేన్‌కి ఆల్రెడీ స్పెష‌ల్ ప్లేస్ ఉంది. ఆర్య‌తో ఆమె చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సీరీస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఆమె మ‌రో స్పెష‌ల్ సీరీస్ చేశారు. ఆ సీరీస్ పేరు తాలి. ఇందులో శ్రీగౌరి సావంత్‌గా న‌టిస్తున్నారు. ఆగ‌స్టు 15న జియో సినిమాస్‌లో విడుద‌ల కానుంది ఈ సీరీస్‌. ఈ సీరీస్ టీజ‌ర్ విడుద‌లైంది. శ్రీగౌరి సావంత్ ఇలాగే ఉంటారంటూ స్నీక్ పీక్ విడుద‌ల చేశారు.

ట్రాన్స్‌జెండ‌ర్ యాక్టివిస్ట్ శ్రీగౌరి సావంత్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సీరీస్‌ని తెర‌కెక్కించారు. ఈ టీజ‌ర్‌లో సుష్మిత మంచి చీర క‌ట్టుకుని మెరూన్ బిందీని స‌ర్దుకుంటూ అద్దం చూసుకుంటున్న‌ట్టు క‌నిపించారు. ఉషా ఉతుప్ ఫొటో ఆమె వెనకున్న క‌ప్‌బోర్డ్ లో క‌నిపిస్తుంది.

శ్రీగౌరి సావంత్ కాళ్ల‌ను ట్రాన్స్ జెండ‌ర్స్ అంద‌రూ తాకుతున్న‌ట్టు ఒక షాట్ ఉంది. నింద‌ల నుంచి ప్ర‌శంస‌ల వ‌ర‌కు శ్రీగౌరి సావంత్ జీవిత ప్ర‌యాణ‌మే ఈ సీరీస్. ఇండియాస్ థ‌ర్డ్ జెండ‌ర్ కోసం శ్రీగౌరి సావంత్ చేసిన పోరాటమే ఈ సీరీస్ సారాంశం అని పేర్కొన్నారు సుష్మిత సేన్‌.

శ్రీగౌరి సావంత్ ఎవ‌రు?
శ్రీగౌరి సావంత్ పుణెలో పుట్టారు. ఆమె బామ్మ ద‌గ్గ‌ర పెరిగారు. 15 ఏళ్లప్పుడు త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. ట్రాన్స్ జెండ‌ర్ల కోసం ప‌నిచేసిన స‌ఖి చార్ చౌగీ ట్ర‌స్ట్ లో చేరారు. 2014లో సుప్రీంకోర్టులో థ‌ర్డ్ జండ‌ర్‌కి సంబంధించి పిటిష‌న్ వేసిన తొలి ట్రాన్స్ జండ‌ర్ ఆమె. గాయ‌త్రి అనే అమ్మాయిని ద‌త్త‌త తీసుకుని పెంచుకున్నారు.

ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమాలోనే సుష్మిత న‌టించారు. ఆమె న‌టించిన ఆర్య సీజ‌న్ 3 కూడా ప్రీమియ‌ర్స్‌కి సిద్ధ‌మ‌వుతోంది.