English | Telugu
సంజయ్ దత్‌కీ డ్రీమ్ గర్ల్ 2కీ సంబంధం ఏంటి?
Updated : Aug 1, 2023
సంజయ్‌దత్ ఇప్పుడు డ్రీమ్ గర్ల్ 2 సినిమాలో నటించడం లేదు. కాకపోతే ఆ సినిమా తీసిన డైరక్టర్‌తో వర్క్ చేయడానికి రెడీ అయ్యారు. 2019లో విడుదలైంది డ్రీమ్ గర్ల్ మూవీ. ఈ సినిమాకు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. ఆ మూవీ సక్సెస్ తర్వాత సీక్వెల్ రాసుకున్నారు. ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా, అన్ను కపూర్, పరేష్ రావల్, విజయ్ రాజ్, సీమా పహ్వాతో సీక్వెల్‌ని తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్‌కి విశేషమైన స్పందన వస్తోంది. ఈ సినిమా తర్వాత ఆయన ఓ ఫ్యామిలీ కామెడీ మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమాలోనే సంజయ్ దత్ మెయిన్ లీడ్ చేయబోతున్నారు. ఈ ఫ్యామిలీ కామెడీ సినిమాను ఈ ఏడాది ఆఖరునగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ తెరకెక్కించాలన్నది ప్లాన్. సంజయ్ దత్ కాల్షీట్ ఇవ్వడాన్ని బట్టి 30 రోజుల్లోనే సినిమా చేయాలనుకుంటటున్నారట రాజ్ శాండిల్య ``రాజ్ శాండిల్య, ఆయన టీమ్ రాసుకున్న కథ సంజయ్‌దత్‌కి చాలా బాగా నచ్చింది.
కథ విన్న వెంటనే ఓకే చెప్పేశారు సంజూబాబా. ప్రస్తుతం పేపర్ వర్క్ ప్రోగ్రెస్‌లో ఉంది`` అని చెబుతున్నారు సంజూ సన్నిహితులు. . ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది ఈ సినిమా. ఇండియన్ సినిమాలోని కామిక్ ఆర్టిస్టులందరూ ఈ సినిమాకు పనిచేస్తారని టాక్. ప్రస్తుతం సంజయ్ దత్ సీరియస్ విలన్‌గా పలు సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఈ టైమ్‌లో ఇలాంటి సినిమా రావడం ఆయన కెరీర్‌లో అద్భుతమైన ట్విస్ట్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు. సంజయ్ దత్ ప్రస్తుతం లియో, ఇస్మార్ట్ శంకర్ 2, వెల్కమ్ 3లో నటిస్తున్నారు.