English | Telugu

పుష్ప‌ని ఇమిటేట్ చేయ‌లేద‌న్న దుల్క‌ర్‌

దుల్క‌ర్ స‌ల్మాన్ పుష్ప గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా న‌టించిన సినిమా పుష్ప‌. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫాహ‌ద్ ఫాజిల్ విల‌న్‌గా చేశారు. ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ కి విప‌రీత‌మైన స్పందన వ‌చ్చింది. సెకండ్ పార్ట్ ఇప్పుడు షూటింగ్‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో దుల్క‌ర్ స‌ల్మాన్ పుష్ప గురించి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన సినిమా కింగ్ ఆఫ్ కోత‌. ఈ సినిమా ఈ నెల 25న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ చెన్నైలో జ‌రిగింది. అక్క‌డ దుల్క‌ర్‌కి ఓ ప్ర‌శ్న ఎదురైంది. కింగ్ ఆఫ్ కోత‌ని చూస్తుంటే పుష్ప గుర్తుకొస్తోంది. మీరేమంటారు అని అడిగారు.దానికి స‌మాధానం చెప్పిన దుల్క‌ర్‌, ``దాన్ని కాంప్లిమెంట్‌గా తీసుకుంటాను. అయితే పుష్ప సినిమాను ఇమిటేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌లేదు`` అని ఆన్స‌ర్ చెప్పారు.

కాజోల్ కోసం డ‌బ్బులు పెడుతున్న ప్ర‌భాస్ గ‌ర్ల్ ఫ్రెండ్!

ప్ర‌భాస్ రూమ‌ర్డ్ గ‌ర్ల్ ఫ్రెండ్ కృతిస‌న‌న్ నిర్మాత‌గా మారారు. ఆమె డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టి సినిమా చేస్తున్నారు. కాజోల్‌, కృతిస‌న‌న్ క‌లిసి న‌టిస్తున్న సినిమా దో ప‌ట్టి. దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి ఈ సినిమాలో న‌టిస్తున్నారు. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి రోహిత్ శెట్టి దిల్‌వాలేలో న‌టించారు. దో ప‌ట్టి మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థ‌.నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతోంది. క‌నికా ధిల్లాన్ ఈ మూవీకి ప‌నిచేస్తున్నారు. శ‌శాంక్ చ‌తుర్వేది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొద‌లైంది. ``ఈ సినిమా కోసం కొంత ప్రిపేర్ అయ్యాం. కొన్నిసార్లు స్క్రిప్ట్ రీడింగ్ ఇచ్చాం. దో ప‌ట్టి  రెగ్యుల‌ర్ షూటింగ్ శుక్ర‌వారం మొద‌లైంది. 

టైగ‌ర్ 3కి, క్రిస్ట‌ఫ‌ర్ నోలాన్‌తో క‌నెక్ష‌న్ ఏంటి?

స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్ జంట‌గా న‌టిస్తున్న సినిమా టైగ‌ర్ 3. 2023లో విడుద‌ల‌కు రెడీ అవుతున్న సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ సినిమాకు క్రిస్ట‌ఫ‌ర్ నోలెన్ క‌నెన్ష‌న్ ఉందంటోంది బాలీవుడ్ మీడియా. మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా టైగ‌ర్ 3. ఈ సినిమా ప్రీవియ‌స్ మూవీస్ రెండూ చాలా పెద్ద హిట్ అయ్యాయి. టైగ‌ర్‌, జోయా మ్యాజిక్‌కి మ‌ళ్లీ ఆన్‌స్క్రీన్ చూడటానికి ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నారు జ‌నాలు. ఈ సినిమా కోసం టాప్ హాలీవుడ్ యాక్ష‌న్ కో ఆర్డినేట‌ర్ క్రిస్ బ‌ర్నెస్‌ని హ‌య‌ర్ చేసుకున్నార‌ట‌. ఈయ‌న గ‌తంలో ఎవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌, ఒప్పెన్ హైమ‌ర్‌కు ప‌నిచేశారు. క్రిస్ట‌ఫ‌ర్ నోలెన్ క‌లెక్ష‌న్ ఇలా వ‌చ్చింది టైగ‌ర్‌3కి.

రానాకి సోన‌మ్ ఘాటు కౌంట‌ర్‌

టాలీవుడ్ స్టార్ రానా ద‌గ్గుబాటి టైమ్ అస్స‌లు బాగున్న‌ట్లు లేదు. ఎందుకంటే రీసెంట్‌గా ఆయ‌న దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన‌.. కింగ్ ఆఫ్ కోథా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రానా ఓ హీరోయిన్ పేరు చెప్ప‌కుండా ఆమె త‌న భ‌ర్త‌తో చేసిన షాపింగ్ వ‌ల్ల హీరో దుల్క‌ర్ అండ్ టీమ్ ప‌డ్డ ఇబ్బందులు గురించి కామెంట్స్ చేశారు. రానా పేరు చెప్ప‌కపోయినప్ప‌టికీ సోన‌మ్ క‌పూర్‌ని ఉద్దేశించే ఆయ‌న కామెంట్స్ చేశారంటూ వార్త‌లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అయితే త‌న త‌ప్పును వెంట‌నే రానా స‌రిదిద్దుకునే ప‌నిలో ప‌డ్డారు. అందులో భాగంగా ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆమెకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

ఖిలాడీతో క‌లిసిన సునీల్‌... ప్రీ ప్రొడ‌క్ష‌న్ షురూ!

అక్ష‌య్‌కుమార్ హీరోగా ఫిరోజ్ న‌దియ‌డ్‌వాలా తెర‌కెక్కిస్తున్న సినిమా వెల్క‌మ్ 3. ఆవారా పాగ‌ల్ దీవానా2, హెరా ఫెరీ3 త‌ర్వాత తెర‌కెక్కుతున్న సినిమా ఇది. వెల్క‌మ్ 3లో అక్ష‌య్‌కుమార్‌తో పాటు సంజ‌య్ ద‌త్‌, అర్ష‌ద్ వార్షి కూడా క‌లిసి న‌టిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఈ సినిమా యూనిట్ స్పెష‌ల్ ఫొటో షూట్ చేసింది. సినిమాను అనౌన్స్ చేయడానికే ఈ ఫొటో షూట్ చేశారు. ఈ మూవీలో జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్‌, దిశా పటానీ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. వెల్క‌మ్ 3 కోసం తాజాగా సునీల్ శెట్టిని రిక్రూట్ చేశారు. ప‌వ‌ర్‌ఫుల్ రోల్ గురించి విన‌గానే ఓకే చెప్పేశార‌ట సునీల్ శెట్టి.

డాన్ 3 సెట్స్ మీద‌కు వెళ్లేది అప్పుడే!

ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాలు, సెట్స్ మీదున్న సినిమాలే కాదు, త్వ‌ర‌లో స్టార్ట్ కాబోయే సినిమాల మీద కూడా ఇంట్ర‌స్టింగ్ డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. సేమ్ డిస్క‌ష‌న్ డాన్ 3 మీద కూడా ఉంది. కాక‌పోతే డబుల్ ఇంపాక్ట్ క‌నిపిస్తోంది అక్క‌డ‌. ఫ‌ర్హాన్ అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది డాన్ 3. షారుఖ్‌ఖాన్ ప్లేస్‌లో ర‌ణ్‌వీర్ సింగ్‌ని తీసుకుని డాన్ 3 ని చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఫ‌ర్హాన్ అక్త‌ర్ డీటైల్డ్‌గా మాట్లాడారు. ఈ సినిమా 2025 నుంచి సెట్స్ మీద‌కు వెళ్తుందని డిక్లేర్ చేశారు ఫ‌ర్హాన్ అక్త‌ర్‌. లాస్ట్ వీక్ రివీల్ చేశారు డాన్ 3 గురించి. ఇందులో ర‌ణ్‌వీర్ సింగ్ డాన్‌గా న‌టిస్తార‌ని అనౌన్స్ చేశారు. ఒక్క‌సారిగా ఇంట‌ర్నెట్ షేక్ అయింది. అయితే డాన్‌లో షారుఖ్‌ని ర‌ణ్‌వీర్ సింగ్ రీప్లేస్ చేయ‌డం ప‌ట్ల కొంద‌రు ఎగ్జ‌యిట్ అయితే, మ‌రికొంద‌రు అదేంట‌ని పెద‌వి విరిచారు.

విదేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న తొలి బాలీవుడ్ సినిమా గురించి తెలుసా?

ఈ వారం బాలీవుడ్‌లో హిట్ సౌండ్ మామూలుగా లేదు. మ‌న స‌త్తా చూపించిన వార‌మిది అంటూ గ‌ర్వప‌డుతోంది బాలీవుడ్‌. గ‌దార్‌2, ప‌ఠాన్‌, రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ క‌హానీ, జ‌ర హ‌ట్కే జ‌ర బ‌చ్కే అంటూ సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ వ‌చ్చేశాయి ఈ ఏడాది.బాలీవుడ్ అంత ఆనందంగా ఉన్న ఈ  టైమ్‌లో అస‌లు ఫారిన్ లొకేష‌న్ల‌లో షూటింగ్ జ‌రుపుకున్న బాలీవుడ్ సినిమా ఏంటి? అనే విష‌యం మీద డీప్ డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. 1960లో విడుద‌లైన సంగం మూవీ కోసం తొలిసారి ఫారిన్ లొకేష‌న్ల‌లో షూటింగ్ చేశార‌ట‌.రాజ్‌క‌పూర్ త‌న న‌టీన‌టుల‌ను అంద‌రినీ వెంట‌పెట్టుకుని యూరోప్‌లో తొలిసారి షూటింగ్ చేశార‌ట‌. ముగ్గురు స్నేహితుల క‌థ‌ను చెప్పిన సినిమా సంగం. అప్ప‌ట్లో చాలా ఖ‌ర్చుపెట్టి తెర‌కెక్కించారు. చాలా ఎమోష‌న‌ల్‌గా సాగే రొమాంటిక్ డ్రామా అది.

అక్ష‌య్‌కి భార‌త పౌర‌స‌త్వం.. ఇక‌నైనా విమ‌ర్శ‌లు ఆగేనా!

సినీ ల‌వ‌ర్స్‌కి బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ గురించిన ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అయితే ఆయ‌న‌కు భార‌తీయ పౌర‌స‌త్వం లేదు. కెన‌డా సిటిజ‌న్‌షిప్ మాత్ర‌మే ఉంది. 2019లో అక్ష‌య్ భార‌తీయ పౌర‌స‌త్వానికి అప్లికేష‌న్ పెట్టుకున్నారు. నాలుగేళ్ల‌కు ఆయ‌న‌కు మ‌న దేశ పౌర‌సత్వాన్ని ఇచ్చారు. బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న అక్ష‌య్ కుమార్ ఇన్నేళ్లు కెన‌డా పౌర‌స‌త్వంతోనే ఉంటున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయితే భార‌త ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు స్పందించి  పౌర‌స‌త్వం ఇవ్వ‌టంపై అక్ష‌య్‌ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.