English | Telugu
ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్న విజయ్... ఎందుకో తెలుసా?
Updated : Aug 16, 2023
ఇప్పుడు నేషనల్ వైడ్ అప్‌కమింగ్ మూవీస్‌లో మోస్ట్ ఎవెయిటెడ్ లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతోంది 'జవాన్' సినిమా. అంతలా ఊరిస్తున్న 'జవాన్' సినిమా కోసం ఆర్టిస్టులు కూడా ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. దీపిక పదుకోన్, ప్రియమణి కీ రోల్స్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారు. ది డీలర్ ఆఫ్ డెత్ అంటూ అతని కేరక్టర్‌ని పరిచయం చేశారు డైరక్టర్ అట్లీ. నేను డిస్‌క్రైబ్ చేసినదానిలో ఏమాత్రం తప్పు లేదని సెప్టెంబర్ 7న అందరూ అంగీకరిస్తారని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి, ప్రివ్యూకి, రెండు పాటలకీ చాలా మంచి స్పందన వస్తోంది. నార్త్‌లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం విజయ్ సేతుపతి మీద అట్లీ స్పెషల్ ప్రోమో డిజైన్ చేశారు. అయితే అది సోలో ప్రోమోనా, సినిమాలో నటీనటులందరూ పాల్గొన్నారా అనేది సస్పెన్స్. ఓ వైపు 'విడుదలై2' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు విజయ్ సేతుపతి.
'కాకా ముట్టై' మనికందన్ వెబ్ సీరీస్ కూడా చేస్తున్నారు. ఇంత బిజీలోనూ ఆయన 'జవాన్' సినిమా కోసం ప్రోమో షూట్ చేశారంటే, ప్రాజెక్ట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉండబట్టి అని అంటున్నారు జనాలు. షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' ఈ ఏడాది వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పుడు 'జవాన్' టార్గెట్ 'పఠాన్' కలెక్షన్లే. అంటే ఒకే ఏడాది ఒకటికి రెండు వెయ్యికోట్ల సినిమాలను ఇచ్చిన హీరో ఇప్పటిదాకా లేరు. ఈ సినిమాతో ఆ రేరెస్ట్ ఫీట్ అందుకోవాలనుకుంటున్నారు షారుఖ్.