Read more!

English | Telugu

జ‌వాన్ అడ్వాన్స్ బుకింగ్స్... స్పంద‌న మామూలుగా లేదు!

షారుఖ్ ఖాన్ న‌టించిన సినిమా జ‌వాన్‌. ఈ సినిమాకు ఇంట‌ర్నేష‌న‌ల్ ప్లాట్‌ఫార్మ్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌ల‌య్యాయి. యుఎస్‌. యుఎఇ, ఒమ‌న్‌, ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీతో పాటు మ‌రికొన్ని దేశాల్లో ఈ బుకింగ్స్ మొద‌ల‌య్యాయి.

షారుఖ్ న‌టించిన ప‌ఠాన్ సినిమాకు వెయ్యి కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రావ‌డంతో, జ‌వాన్ సినిమా విడుద‌ల కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ ఆడియ‌న్స్ కూడా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

మామూలుగా అయితే, అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత త్వ‌ర‌గా ఓపెన్ కావు. కానీ గ్లోబ‌ల్ ఎగ్జిబిట‌ర్స్ డిమాండ్ మేర‌కు జ‌వాన్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. జ‌వాన్ సినిమా కోసం ఇండియ‌లోనే కాదు, ఓవ‌ర్సీస్‌లోనూ అంతే ఆత్రుత‌తో ఎదురుచూస్తున్నార‌నే సంగ‌తి ఇప్పుడు ప్రూవ్ అయింది.

అట్లీ డైర‌క్ట్ చేస్తున్న సినిమా జ‌వాన్‌. సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. హిందీ, త‌మిళ్‌, తెలుగులో విడుద‌ల కానుంది. న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, దీపిక ప‌దుకోన్‌, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాలో యాక్ష‌న్ సన్నివేశాలు మ‌రో రేంజ్‌లో ఉంటాయ‌ని హింట్ ఇచ్చారు అట్లీ.

జ‌వాన్‌లో విజ‌య్ గెస్ట్ రోల్ చేస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ సినిమాలో న‌య‌న‌తార పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు. హిందీలో ఆమెకి ఇదే తొలి చిత్రం.

ప‌ఠాన్ క‌లెక్ష‌న్లను జ‌వాన్ క్రాస్ చేస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు షారుఖ్ ఖాన్‌.