English | Telugu

రాజేంద్ర‌ప్ర‌సాద్, భానుప్రియతో రైట‌ర్ స‌త్యానంద్ ఓ సినిమాని డైరెక్ట్ చేశార‌ని తెలుసా?

ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు స‌త్యానంద్‌. ఎన్టీ రామారావు ద‌గ్గ‌ర్నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్‌బాబు వ‌ర‌కు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల‌కు మాట‌ల ర‌చ‌యిత‌గా, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా, క‌థా ర‌చ‌యిత‌గా ప‌నిచేసి తెలుగు చిత్ర‌సీమ‌లోని పాపుల‌ర్ రైట‌ర్స్‌లో ఒక‌రిగా పేరుపొందారు. రైట‌ర్స్ డైరెక్ట‌ర్స్ కావ‌డం చాలా కాలం నుంచి ఉన్న‌దే. దాస‌రి, జంధ్యాల కాలం నుంచి ఇప్ప‌టి త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ దాకా ఎంతోమంది ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులుగా మారారు.