English | Telugu

అనుతో ఆర్య‌కు చెక్ పెట్టిన రాగ‌సుధ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతోంది. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సీరియ‌ల్ అనుక్ష‌ణం ఉత్కంఠ‌భ‌రిత మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంతోంది. ఇందులో `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్‌, రామ్ జ‌గ‌న్‌, జయ‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, అనుష సంతోష్‌, రాధాకృష్ణ‌, మ‌ధుశ్రీ‌, సందీప్‌, ఉమాదేవి త‌దిత‌రులు న‌టించారు. అర్థ్రాంత‌రంగా చ‌నిపోయిన ఓ యువ‌తి మ‌ర్ద‌ర్ మిస్ట‌రీ చుట్టూ తిరిగే క‌థ‌గా ఈ సీరియ‌ల్ ఉత్క‌ఠ‌భరిత మ‌లుపుల‌తో సాగుతోంది.

తిలోత్త‌మ చుట్టూ ఉచ్చుబిగిస్తున్న న‌య‌ని

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌రం వున్న ఓ యువ‌తి క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. త‌న భ‌ర్త త‌ల్లిని దారుణంగా హ‌త్య చేసి ఆమె స్థానాన్ని అక్ర‌మించి ఇంటిని, ఆస్తుల్ని త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకున్న తిలోత్త‌మ‌కు ప‌ల్లెటూరి యువ‌తి అయిన న‌య‌ని ఎలాంటి గుణ‌పాఠం చెప్పింది? చివ‌రికి త‌న ఆట ఎలా క‌ట్టించింద‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌, క‌థనాల‌తో ఈ సీరియ‌ల్ సాగుతోంది. క‌న్న‌డ న‌టులు అషికా గోపాల్‌, చందు గౌడ ప్ర‌ధాన‌ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర‌, విష్ణు ప్రియ‌, భావ‌నా రెడ్డి, అనిల్ చౌద‌రి, శ్రీ స‌త్య‌, నిహారిక నటించారు..