'ఓ అందాల రాక్షసి' పాజిటివ్ మౌత్ టాక్తో దూసుకుపోతోంది.. సక్సెస్ మీట్లో చిత్రయూనిట్
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీకి మంచి పేరుంది. ఆయన తాజాగా మార్చి 21న ‘ఓ అందాల రాక్షసి’ అంటూ అందరి ముందుకు వచ్చారు. షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో తెరకెక్కించారు.