English | Telugu

పెళ్లి చేసుకుంది ఎవర్ని! వీడిన మిస్టరీ


-ఎవరు ఆ పెళ్లి కొడుకు
-మెహ్రిన్ వ్యాఖ్యలు కరెక్టే కదా
-ప్రస్తుతం చేస్తున్న సినిమాలు


విక్టరీ వెంకటేష్(venkatesh),మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej),అనిల్ రావిపూడి(ANil Ravipudi),దిల్ రాజు(Dil Raju) లు సెల్యులాయిడ్ పై సృషించిన 'ఎఫ్ 2 'మూవీ అభిమానులు, ప్రేక్షకులపై ఎంతగా ప్రభావం చూపించిందో తెలిసిన విషయమే. ఈ మూవీలో హనీ అనే క్యారక్టర్ లో 'హనీ ఈజ్ ది బెస్ట్' అనే డైలాగ్ తో అంతే ప్రభావం చూపించిన భామ 'మెహ్రిన్'(Mehreen). పంజాబ్ కి చెందిన ఈ ముద్దుగుమ్మ 2016 లో నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమైంది. అనతికాలంలోనే పలు చిత్రాల్లో నటించి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది.

2021మార్చి 21 న మెహ్రీన్ కి రాజస్థాన్ క్యాప్టల్ జైపూర్ కి చెందిన 'భవ్య బిష్ణోయ్' అనే పొలిటీషియన్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. భారతీయ జనతా పార్టీ తరుపున అడంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి ఎంఎల్ఏ గా బిష్ణోయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బిష్ణోయ్ తాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ . కానీ ఆ తర్వాత ఆ ఇద్దరి వివాహం క్యాన్సిల్ అయ్యింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెహ్రీన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మెహ్రిన్ ఇనిస్టాగ్రమ్ వేదికగా స్పందిస్తు 'నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టుగా న్యూస్ రాస్తున్నారు. నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. మీరు చెప్తున్న ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. కనీసం పరిచయం కూడా లేదు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ప్రపంచానికి చెప్తాను. దయ చేసి నా పెళ్లి వదంతులు వ్యాప్తి చెయ్యవద్దని మెహ్రిన్ కోరింది.

also read: నెక్ట్స్‌ మూవీ హీరో ఎవరు? ఈ స్టార్ ఓకేనా మీకు

ఇక మెహ్రీన్ సినీ కెరీర్ విషయానికి వస్తే బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ తర్వాత ఎఫ్ 3 తో పాటు స్పార్క్ లైఫ్ అనే మూవీలో మెరిసింది.తమిళంలో వసంత్ రవితో కలిసి ఇంద్ర అనే సినిమాలో ఈ ఏడాది కనిపించగా, ప్రస్తుతం కన్నడంలో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.