English | Telugu

నా ఆస్తులు తాకట్టులో ఉంటే ఎన్టీఆర్ ఏం చేసారో తెలుసా!

ప్రముఖ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu)గత నెల మార్చి 19 న 73 సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.బర్త్ డే వేడుకలు తిరుపతిలోని తన యూనివర్సిటీ లో జరగగా శరత్ కుమార్,ప్రభుదేవా హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.మోహన్ బాబు ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ 'కన్నప్ప'(Kannappa)తో బిజీగా ఉన్నాడు.మంచు విష్ణు(Vishnu) 'కన్నప్ప'గా టైటిల్ రోల్ లో చేస్తుండగా ప్రభాస్(Prabhas)మోహన్ లాల్(Mohanlal)అక్షయ్ కుమార్(Akshay KUmar)వంటి మేటినటులు కీలక పాత్రలు చేస్తున్నారు.మోహన్ బాబు కూడా ఒక కీలక క్యారక్టర్ లో నటించడంతో పాటు 'కన్నప్ప' కి నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు.

ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు..అందుకే పార్ట్ 2 చెయ్యటం లేదు

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)కెరీర్ లో ఉన్న ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ లో 'అదుర్స్'(Adhurs)కూడా ఒకటి.అయితే మిగతా సినిమాల హిట్ కి 'అదుర్స్' హిట్ కి ఎంతో ప్రత్యేకత ఉంది.చారి,నరసింహ అనే రెండు వైవిధ్యంతో కూడుకున్న క్యారక్టర్ లలో అవలీలగా నటించి టైటిల్ కి తగ్గట్టే అదుర్స్ అనిపించాడు.ముఖ్యంగా చారి క్యారక్టర్ ద్వారా తనలో ఉన్నకామెడీ యాంగిల్ ని ప్రేక్షకులకి పరిచయం చేసి కామెడీ ని పండించడంలో కూడా తిరుగులేదని నిరూపించాడు.చారిగా ఎన్టీఆర్ పలికించిన డైలాగ్ మాడ్యులేషన్ కోసం నేటికీ అదుర్స్ ని యూట్యూబ్ లో చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.