సురవరం ద లీడర్!
లీడర్.. తన పార్టీకి, కేడర్‌కు, జాతి భవితకు ఓ రాడార్. తన మాటతో, చేతతో కార్యకర్తలను కదంతొక్కించడమే కాదు, తన వాగ్ధాటితో, వాదనా పటిమతో ప్రత్యర్థులను నిరుత్తరులను చేయడం, మేధావులు, నిపుణులు, విశ్లేషకుల మద్దతు పొందడంద్వారానే నాయకుడనిపించుకుంటారు. అటువంటి సమర్ధ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి.