టన్ను ఇసుకపై రూ.1000 పెంపు... తెలంగాణలో మొదలైన ఇసుక సంక్షోభం
ఏపీలోనే కాదు తెలంగాణ లోనూ ఇసుక బంగారమైంది. ఒక్కసారిగా ఇసుక ధరకు రెక్కలొచ్చాయి. నిన్నమొన్నిటి వరకు టన్ను రూ.1400 రూపాయలకు అటు ఇటుగా ఉన్న ఇసుక ధర అమాంతంగా రూ.1000 రూపాయల వరకు పెరిగింది. ఈ ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది. ప్రభుత్వ విధానంతో పాటు మేడారం జాతర సందర్భంగా ఆంక్షలు విధించడం ఇందుకు కారణంగా చూపుతున్నారు..