English | Telugu
శ్రీనివాసరెడ్డిని చంపేయండి.. గవర్నర్ ని కోరిన హాజిపూర్ బాధిత కుటుంబాలు
Updated : Dec 16, 2019
గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను హాజీపూర్ బాధిత కుటుంబాలు కలిశాయి. తమ పిల్లల పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలనివారు కోరారు. హాజీపూర్ కు బ్రిడ్జి నిర్మించాలని తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. ఘటనలు వెలుగు లోకి వచ్చి ఆరు నెలలైనా నిందితుడికి శిక్ష పడకపోవటం పై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిశ ఎన్ కౌంటర్ తర్వాత తమ నిరసన తీవ్రం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఇవాళ గవర్నర్ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.
హాజిపూర్ ఈ పేరు వింటే చాలు సైకో శ్రీనివాసరెడ్డి ఘాతుకం కళ్ళముందు కదలాడుతుంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత అమ్మాయిల పై దారుణాలకు తెగబడ్డ నిందితుల పరిస్థితి ఏంటి, వారి విషయంలో ఏం చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఎన్ కౌంటర్ పై రచ్చ జరుగుతుంటే బాధిత కుటుంబాలు మాత్రం మృగాళ్లను కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి అలియాస్ సైకో శ్రీను చేసిన దారుణాలు అంత త్వరగా మరచిపోయేవి కావు అమ్మాయిలను ట్రాప్ చేయడం తర్వాత అత్యాచారానికి ఒడిగట్టడం అనంతరం హత్య చేసి పూడ్చిపెట్టడం ఏకంగా తన పొలంలోని బావినే అడ్డాగా చేసుకొని అభం శుభం తెలియని అమ్మాయిల జీవితాలను ఛిద్రం చేశాడు. నేరం చేసి తనకేపాపం తెలీదన్నట్టు అందరిని నమ్మించాడు. కానీ అతనిలో ఉన్న సైకో కోణం కొద్ది రోజులకి వెలుగుచూసింది.