అవతార్ రేంజ్లో శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. గేమ్ ఛేంజర్ అవుతుందా..?
ఒకప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ అంటే ఓ బ్రాండ్. అప్పట్లోనే భారీ సినిమాలు తీసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'జెంటిల్ మేన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు', 'రోబో' వంటి సినిమాలతో సంచలనం సృష్టించాడు. అలాంటి శంకర్ కొన్నేళ్లుగా వెనకబడిపోయాడు. ముఖ్యంగా గత రెండు చిత్రాలు 'భారతీయుడు 2', 'గేమ్ ఛేంజర్' దారుణంగా నిరాశపరిచాయి.