English | Telugu

‘కాంచన4’ చిత్రానికి భారీ బజ్‌.. లారెన్స్‌ టార్గెట్‌ 100 కోట్లు!

ఒకప్పుడు పూర్తి స్థాయి కామెడీ సినిమాలు వచ్చేవి. అలాగే పూర్తి స్థాయి హారర్‌ మూవీస్‌ వచ్చేవి. హారర్‌తో కామెడీని మిక్స్‌ చేసి సినిమా చెయ్యడం అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. ఆ ఫీట్‌ని సమర్థవంతంగా పూర్తి చేసిన ఘనత రాఘవ లారెన్స్‌కి దక్కుతుంది. 2007లో అతని డైరెక్షన్‌లోనే వచ్చిన ‘ముని’ చిత్రం పూర్తి స్థాయి హారర్‌ మూవీగా ఉంటుంది. ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కాంచన’ చిత్రానికి కామెడీని కూడా మిక్స్‌ చేశారు. ఈ సినిమా తమిళ్‌, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించింది. హారర్‌ కామెడీ చిత్రాలకు శ్రీకారం చుట్టి ఆ తర్వాత ఈ తరహా సినిమాలు మరిన్ని రావడానికి దోహదపడ్డారు లారెన్స్‌. ఈ సిరీస్‌లో భాగంగానే 2019లో ‘కాంచన3’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ‘కాంచన4’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లారెన్స్‌.

ముని సిరీస్‌లో వస్తున్న ఈ సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. లారెన్స్‌ నుంచి ఈ సిరీస్‌లో ఏ సినిమా వచ్చినా విపరీతంగా ఆదరిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి మూడు భాగాల కంటే హారర్‌, కామెడీ పాళ్లు పెంచి ‘కాంచన4’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లారెన్స్‌. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం మహాబలిపురంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను లారెన్స్‌, పూజా హెగ్డే, ఇతర ముఖ్య తారాగణంపై చిత్రీకరిస్తున్నారు. కామెడీ హారర్‌ చిత్రాలుగా వచ్చిన కాంచన, కాంచన3 చిత్రాలను మించిన స్థాయి కామెడీ కాంచన4లో ఉంటుందని, అలాగే ప్రేక్షకుల్ని మరింత భయపెట్టేందుకు ఈ సినిమాలో కొన్ని కొత్త ఎలిమెంట్స్‌ని చూపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ను త్వరలోనే పూర్తి చేసి ఆగస్ట్‌లో చివరి షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేస్తారు.

ఆగస్ట్‌లో ప్రారంభమయ్యే చివరి షెడ్యూల్‌తో ‘కాంచన4’కి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరలో సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కాంచన 4కి బాలీవుడ్‌ మార్కెట్‌లో కూడా మంచి హైప్‌ ఉండడంతో ఈ సినిమాను పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో వచ్చిన కాంచన సిరీస్‌లో లేని నటీనటులు ఈ సినిమాలో ఉంటారని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలకు మించిన స్థాయిలో కాంచన 4కి ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాకి 100 కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆ స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘కాంచన4’కి ఉన్న బజ్‌ చూస్తుంటే తప్పకుండా ఇది కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం