English | Telugu

బంజారాహిల్స్‌లో కుంగిన రోడ్డు..దిగబడిన వాటర్ ట్యాంకర్

హైదరాబాద్‌లో నిన్న కురిసిన భారీ వర్షాలకు నగరం అల్లకల్లోలం అయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబ‌ర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. అటు వచ్చిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా దిగబడిపోయింది. దీంతో వాట‌ర్ ట్యాంక‌ర్ డ్రైవ‌ర్‌తో పాటు క్లీన‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు.. డ్రైవ‌ర్, క్లీన‌ర్‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. భారీ వ‌ర్షం కార‌ణంగానే రోడ్డు కుంగిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డు కుంగిన ఏరియాలో నాలా పైప్‌లైన్ ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. రోడ్డు కుంగ‌డంతో ఆ ఏరియాతో పాటు స‌మీప ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది. వాట‌ర్ ట్యాంక‌ర్‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ట్రాఫిక్ పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.