English | Telugu

బాలీవుడ్ నటులకు స్ఫూర్తి ఆ బామ్మ


అలనాటి జోరా చిత్రం

బాలీవుడ్ అలనాటి నటి జోరా సెహెగల్ గురువారం మరణించారు. 102 ఏళ్ల జోరా గత రాత్రి న్యూఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో గుండె సంబంధ వ్యాధితో బాధ పడుతూ తుదిశ్వాస విడిచారు. నటిగానే కాక నృత్య కళాకారిణిగా ఆమె పలుదేశాల్లో ఎంతో పేరు గడించారు.

చీనికమ్ చిత్రంలో జోరా అమితాబ్ తల్లిగా నటించారు. అలాగే ఐశ్వర్య బామ్మగా హమ్ దిల్ దేచుకే సనమ్ చిత్రంలో నటించారు. 1946 ధర్తి కే లాల్ చిత్రం నుంచి మొదలు పెట్టి 2007 సావరియా వరకు దాదాపు అరవై ఏళ్ల పాటు ఆమె సినీ రంగంలో నటిగా అనేక పాత్రలు పోషించారు.

ఎంతో మందికి ఇష్టమైన బామ్మ జోరా. కరీనా లాంటి నేటి తరం హీరోయినలకు ఆమె స్ఫూర్తి అంటే నమ్మక తప్పదు. 90 దాటినా జోరాలా సినిమాల్లో నటిస్తా అని కరీనా ఓ సందర్భంలో చెప్పటం చూస్తే ఆమె నటిగా బాలీవుడ్ లో ఎంతటి ముద్ర వేశారో అర్థమవుతుంది. 95 సంవత్సరాల వయసు వచ్చే వరకూ ఆమె చిత్రాల్లో నటిస్తు ఉండటం విశేషం.

సుదీర్ఘకాలం సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ, పద్మభుషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందించారు. ఆమె మరణం పట్ల అమితాబ్ సహా సినీరంగానికి సంబధించిన పలువురు సంతాపం ప్రకటించారు. దేశ ప్రధాని నరేంద్రమోడి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆమె మరణం పట్ల సంతాపాన్ని తెలిపారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.