English | Telugu

ఆచార్య దేవా.. కొరటాలను ఆ దేవరే కాపాడాలి!

టాలీవుడ్ లో ఈ జనరేషన్ లో సక్సెస్ ఫుల్ దర్శకులలో ఒకరిగా కొరటాల శివ పేరు తెచ్చుకున్నారు. పలు విజయవంతమైన సినిమాలకు రచయితగా పనిచేసిన కొరటాల.. 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి కమర్షియల్ సక్సెస్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. ఆ తరువాత కూడా అదే జోరుని కొనసాగిస్తూ 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' ఇలా వరుస విజయాలను అందుకున్నారు. కొరటాల సినిమా అంటే హిట్టే అనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేశారు. అలాంటి సమయంలో ఆయనకు దర్శకుడిగా తన ఐదవ సినిమా 'ఆచార్య' రూపంలో ఘోర పరాజయం ఎదురైంది. వరుసగా నాలుగు విజయాలతో కొరటాలకు వచ్చిన ఇమేజ్ కి 'ఆచార్య' గండి కొట్టింది. ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న 'దేవర'నే ఆయనను కాపాడాలి అనుకునే పరిస్థితి ఏర్పడేలా చేసింది.

ఘన విజయాలను అందించిన బడా దర్శకుడైనా ఒక్క ఘోర పరాజయాన్ని అందిస్తే చాలు.. విమర్శలు ఎదుర్కోక, ఒత్తిడికి లోనవ్వక తప్పదు. ఇప్పుడు కొరటాల ది కూడా అదే పరిస్థితి. 'ఆచార్య' విడుదల కాకముందే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'దేవర' సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు కొరటాల. 'ఆచార్య' ఘోర పరాజయం దెబ్బకి ఎన్టీఆర్, ఆయనతో సినిమా చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆచార్య పరాజయాన్ని పట్టించుకోకుండా కొరటాల ప్రతిభ మీద నమ్మకంతో సినిమా చేయడానికి ముందడుగు వేశారు. ఆ రకంగా కొరటాల సగం విజయం సాధించినట్లే కానీ, ఆయనకు అసలు పరీక్ష ముందుంది. ఆయన 'ఆచార్య' చేదు జ్ఞాపకాల నుంచి బయటపడటం అంత తేలిక కాదు. ఆ ఒత్తిడిని జయించి దేవర తో కమ్ బ్యాక్ ఇవ్వాలి.

నిజానికి విడుదలకు ముందు 'ఆచార్య' మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తండ్రీకొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి సినిమా కావడంతో పాటు, 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడం, అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. తీరా విడుదలయ్యాక అంచనాలను ఏమాత్రం అందుకోలేక బిగ్ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ డిజాస్టర్ భారాన్ని కొరటాలనే ఎక్కువగా మోయాల్సి వచ్చింది. పలువురు కొరటాలపై విమర్శలు గుప్పించారు. ప్రతి సినిమాలో కొరటాల రచయితగా, దర్శకుడిగా తనదైన మార్క్ చూపించారు. కానీ 'ఆచార్య'లో ఎక్కడా కొరటాల మార్క్ కనపడలేదు. అసలిది కొరటాల డైరెక్ట్ చేసిన సినిమానేనా అని అనుమానపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఒకే ఒక్క పరాజయం కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కొరటాల భవిష్యత్ ఇప్పుడు 'దేవర' మీద ఆధారపడి ఉంది. 'ఆచార్య' పరాజయంతో పాటు, రాజమౌళి హీరోల నెగటివ్ సెంటిమెంట్ కారణంగా 'దేవర' విషయంలో తీవ్ర ఒత్తిడి ఉంది. రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ ఎదురవ్వడం అనేది ఎప్పటినుంచో సెంటిమెంట్ గా వస్తోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ చేసిన 'ఆచార్య' విషయంలోనూ ఆ సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ సైతం 'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల డైరెక్షన్ లోనే దేవర చేస్తున్నారు. అయితే ఈ విజయం ఎన్టీఆర్ కంటే కొరటాలకి చాలా కీలకం. స్టార్ హీరోలకు వరుసగా రెండు మూడు పరాజయాలు ఎదురైనా వారి ఇమేజ్ కి ఎటువంటి ఢోకా ఉండదు. కానీ దర్శకుల పరిస్థితి అలా ఉండదు. వరుసగా రెండు పరాజయాలు ఎదురైతే కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే దేవరతో బ్లాక్ బస్టర్ కొట్టి, ఆచార్య లెక్క సరిచేయాలని కొరటాల కసిగా పని చేస్తున్నారు.

ఈరోజు(జూన్ 15) కొరటాల పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, దేవర తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.