English | Telugu
దృశ్యం 3: అజయ్, మోహన్‌లాల్ కలిసి పనిచేస్తారా?
Updated : Jun 15, 2023
అజయ్ దేవ్గన్, మోహన్‌లాల్ కలిసి ఒకేసారి సెట్స్ లో ఉండబోతున్నారా? ఇద్దరు స్టార్లను ఒకేసారి డీల్ చేయడానికి జీతు జోసెఫ్ ఫిక్సయ్యారా? అనేది ఇంట్రస్టింగ్ విషయం. దృశ్యం ఒన్ అండ్ టూ, రెండూ బంపర్ హిట్లే. ఇప్పుడు దృశ్యం 3 పనుల్లో ఉన్నారు జీతు జోసెఫ్. 2024లో ఫ్లోర్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐకానిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఫైనల్ ఫిల్మ్ ఇదే అవుతుంది. 2013లో మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కలిసి దృశ్యం మూవీకి వర్క్ చేశారు. హిందీలో అజయ్ దేవ్గన్, తమిళ్లో కమల్‌హాసన్, తెలుగులో వెంకటేష్ ఈ సబ్జెక్టులో ఇన్వాల్వ్ అయ్యి బంపర్ హిట్స్ చూశారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో థర్డ్ పార్ట్ రెడీ అవుతోంది. దృశ్యం3 బేసిక్ ప్లాట్ లాక్ అయింది. ``అభిషేక్ పాథక్, అతని టీమ్ ఆఫ్ రైటర్స్ కలిసి థర్డ్ పార్ట్ ని లాక్ చేశారు. జీతు జోసెఫ్ టీమ్ ఆ థీమ్‌ని బాగా ఇష్టపడింది. ఈ ఐడియాతోనే ఫైనల్ ఎపిసోడ్‌ని కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు`` అన్నది బాలీవుడ్ న్యూస్.
హిందీ, మలయాళంలో ఒకేసారి షూటింగ్ చేయాలన్నది జీతు ఐడియా అట. తెలుగు మేకర్స్ కూడా ఇదే ఐడియా ఫాలో అయితే, ఎట్ ఎ టైమ్ మూడు భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది దృశ్యం ఫైనల్ పార్ట్. తెలుగులో వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ మూవీతో బిజీగా ఉన్నారు. అది పూర్తి కాగానే రానానాయుడు సీక్వెల్ చేస్తారు. అటు మలయాళంలో మోహన్లాల్కి చేతినిండా ప్రాజెక్టులున్నాయి. అజయ్ దేవ్గన్ కూడా వరుస రిలీజులతో బిజీగా ఉన్నారు. 2024కి అందరూ కాల్షీట్ ఖాళీ చేసుకుని దృశ్యం పనుల వైపు మొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.