English | Telugu

బన్నీకి విలన్ ఎవరు?

ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సన్‌ ఆప్‌ సత్యమూర్తి సినిమా ట్రైలర్‌ రానే వచ్చింది. ఇకపోతే ఈ ట్రైలర్‌ ఫ్యాన్స్‌ను బాగానే ఎక్సయిట్‌ చేసినా కూడా, క్రిటిక్స్‌కు మాత్రం పెద్దగా కిక్కివ్వలేదు. ఇకపోతే ఈ ట్రైలర్‌లో హీరో ఉపేంద్ర మిస్సవ్వడం అందరికీ షాకిచ్చింది. అంతేకాదు.. కోట శ్రీనివాసరావు కూడా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు కాని, ఆయన కూడా మిస్సయ్యారు. అసలు ఇంతకీ ఈ సినిమాలో విలన్‌ ఎవరు? నిజానికి ఈ సినిమాలో ఉపేంద్ర పోషిస్తోంది కీలకపాత్రే కాబట్టి.. ఆయన్ను విలన్‌ అని అనుకోలేం. ఒకవేళ ఆయన నెగెటివ్‌గా ఉంటూ పాజిటివ్‌గా మారిపోయే పాత్రను చేస్తున్నారేమో. ఇకపోతే కోట చేసే పాత్ర అత్తారింటికి దారేది టైపులో చెడు నుండి మంచిగా మారే పాత్రేనట. మరి విలన్‌ ఎవరు? విలన్ లేకుండా సినిమాను ఎలా నెట్టుకొస్తాడు త్రివిక్రమ్‌?