English | Telugu

ఎవరేమనుకున్నా, బొమ్మ అదిరిపోయింది.. డబుల్‌ కాలర్‌ ఎత్తి కన్‌ఫర్మ్‌ చేసిన ఎన్టీఆర్‌!


ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ హీరోలుగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘వార్‌2’ ఆగస్ట్‌ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 10న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. వేలాది అభిమానుల మధ్య, సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగిన ఈ ఫంక్షన్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ

‘ఇంత అద్భుతంగా ఈ ఫంక్షన్‌ జరగడానికి, అసలు ఈ ఫంక్షన్‌ చేయాలని ఆలోచన చేసిన నాగవంశీ కారణం. నన్ను బలవంతం చేసి ఈ ఫంక్షన్‌ ఏర్పాటు చేశాడు. ముందుగా అతనికి థాంక్స్‌. మీకు తెలుసు బాద్‌షా ఫంక్షన్‌ జరిగినపుడు వరంగల్‌కి చెందిన ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోయాడు. అది నన్నెంతో బాధించింది. అందుకే ఇలాంటి పబ్లిక్‌ ఈవెంట్స్‌ అంటే నాకు భయం. మీ అందరూ ఫంక్షన్‌ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. మీకోసం మీ ఇంట్లో ఎదురుచూసేవాళ్లుంటారు. ఇక సినిమా విషయానికి వస్తే.. ‘వార్‌2’ చెయ్యడానికి నిర్మాత ఆదిత్య చోప్రాగారు కారణం. ఇది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది. నన్ను నమ్ము అన్నారు. ఆరోజు ఆయన మాటను నేను నమ్మకపోతే.. ఈరోజు ఇంత మంచి సినిమా వచ్చేది కాదు.

హృతిక్‌ రోషన్‌ సర్‌ చేసిన కహోనా ప్యార్‌ హై సినిమా చూసినపుడు అందులో ఆయన చేసిన డాన్స్‌ నన్నెంతో ఇన్‌స్పైర్‌ చేసింది. బెస్ట్‌ డాన్సర్‌ అంటే మైఖేల్‌ జాక్సన్‌ అనుకునేవాడిని. కానీ, హృతిక్‌ సర్‌ డాన్స్‌ చూసి మెస్మరైజ్‌ అయిపోయాను. 25 సంవత్సరాలకు ఆయనతో కలిసి నటించడం, డాన్స్‌ చేయడం నిజంగా గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. నేను చెబుతున్నాను ఇండియాలో నెంబర్‌ వన్‌ డాన్సర్‌ హృతిక్‌రోషన్‌.

నాకు జన్మనిచ్చిన తండ్రి హరికృష్ణగారితో నేను ఒకటే చెప్పాను. మీరు నాకు జన్మనిచ్చారు. కానీ, నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునే అభిమానులే నాకు ఎక్కువ అని. నా మొదటి సినిమా రామోజీరావుగారి ప్రొడక్షన్‌లో నిన్ను చూడాలని చేశాను. ఈ సినిమా రిలీజ్‌ అవ్వకముందే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నేను మీ అభిమానిని అని చెప్పాడు. నా సినిమా ఒక్కటి కూడా రిలీజ్‌ అవ్వలేదు కదా నువ్వెలా నా అభిమానివయ్యావు అని అడిగాను. అవన్నీ నాకు తెలీదండీ.. ఇక నుంచ నేను మీ వెంటే ఉంటాను అన్నాడు. అతని పేరు ముజీబ్‌. అతనితో మొదలైన నా అభిమానులు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు.

‘వార్‌2’ అనేది హిందీ సినిమా కాదు, తెలుగు సినిమా కూడా. నేను హిందీకి వెళ్ళడం కాదు, హృతిక్‌ సర్‌ తెలుగుకి వచ్చారు. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. మీరంతా ఎంజాయ్‌ చేసే ఎలిమెంట్స్‌ చాలా వున్నాయి. కాకపోతే ఆ ట్విస్టులేమిటో మీరు రివీల్‌ చెయ్యకుండా ఉంటే బాగుంటుంది. ఈ సినిమా ఎలా ఉంటుందంటే... అంటూ రెండు కాలర్స్‌ ఎత్తి చూపించారు ఎన్టీఆర్‌. ఆ వెంటనే హృతిక్‌ కూడా వచ్చి రెండు కాలర్స్‌ ఎత్తిపట్టుకున్నారు. సినిమాను అందరూ ఎంజాయ్‌ చెయ్యండి, డబుల్‌ కాలర్‌ ఎత్తాను. అవకాశం ఉంటే మళ్ళీ సక్సెస్‌ మీట్‌లో కలుద్దాం. అలాగే మిమ్మల్నందర్నీ ఒకసారి కలుస్తాను. పోటో సెషన్‌ చేద్దాం. అందరితోనూ ఫోటోలు దిగుతాను’ అన్నారు ఎన్టీఆర్‌.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.