English | Telugu
నాని, సుజిత్ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Updated : Feb 2, 2026
నాని, సుజిత్ కాంబినేషన్‌లో ఒక క్రేజీ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే సాహో, ఓజీ వంటి భారీ సినిమాలను డైరెక్ట్ చేసిన సుజిత్.. ఈసారి నాని కోసం ఓపవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ని రెడీ చేశారు. ఇప్పటివరకు చూడని ఓ కొత్త లుక్‌లో ఈ సినిమాలో నాని కనిపించబోతున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ సినిమా నానికి ఒక కొత్త ఇమేజ్‌ని తెస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్‌డేట్ అందర్నీ షాకింగ్‌కి గురి చేస్తోంది. ఇప్పటి వరకు టాప్ హీరోలతో జోడీ కట్టిన పూజా హెగ్డే ఈ సినిమాలో నాని సరసన నటించబోతోందని సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించలేదు. దీంతో ఈ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్‌గా ఇది హిట్ పెయిర్ అవుతుందని భావిస్తున్నారు. ఇక మేకింగ్ విషయానికి వస్తే.. ఈ ప్రాజెక్ట్ విషయంలో సుజిత్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. 2027లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు.