English | Telugu
సైలెంట్ గా 'వార్ 2' షూటింగ్ మొదలైంది
Updated : Oct 18, 2023
జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా ప్రారంభమైంది.
నిన్న(అక్టోబర్ 17న) స్పెయిన్ లో 'వార్ 2' షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ లో కార్ చేజ్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ ప్రారంభమవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. త్వరలోనే ప్రధాన తారాగణం ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'దేవర' చేస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. ప్రస్తుతం 'దేవర-1' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ పూర్తి కాగానే 'వార్ 2' సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు ఎన్టీఆర్.