English | Telugu

ఆత్మహత్య చేసుకోవాలని ఉంది..చిరంజీవికి రూపాయి ఇచ్చిన నటి  వెల్లడి 


ఆమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన మంచి నటీమణి. 1984వ సంవత్సరంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఛాలెంజ్ సినిమాలో చిరంజీవికి రూపాయి ఇచ్చి చిరంజీవి లక్షలు సంపాదించడానికి కారణం అయ్యింది కూడా ఆ నటే. ఆమె ఎవరో కాదు పావలా శ్యామల. ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలని పోషించిన ఆమె తాజాగా తన పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు పలువురిని కంటతడిపెట్టిస్తున్నాయి.

పావలా శ్యామల తన సినిమా కెరీర్ లో దాదాపు 250 కి పైగా చిత్రాల్లో నటించింది. అలాగే ఎన్నో అవార్డులని కూడా అందుకుంది. ఇప్పుడు తాజాగా పావలా శ్యామల ప్రస్తుతం ఉన్న తన పరిస్థితి తో పాటు ఈ నిమిషం తాను ఏమనుకుంటుందో కూడా చెప్పింది. నడవలేని నా కూతురు శాశ్వతంగా మంచంలోనే పడి ఉందని అలాగే నా ఆరోగ్యం కూడా బాగోలేదని ఇద్దరికి మందులు వాడాలని చెప్పింది. అలాగే కనీసం కడుపు నిండా తినటానికి కూడా డబ్బులు లేవనినేను నటించినప్పుడు వచ్చిన కొన్ని అవార్డు లని అమ్ముకుని ఇన్ని రోజులు తిన్నామని ఇప్పుడు అవి కూడా అయిపోయాయి అని ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. అలాగే ప్రతి ఒక్క మానవ హృదయాల్ని కదిలించేలా ఇంకో మాట ని కూడా శ్యామల చెప్పింది .ఆత్మ హత్య చేసుకోవాలని ఉందని కానీ దైర్యం సరిపోవడం లేదని చెప్పింది.ఇప్పుడు పావలా శ్యామల చెప్పిన ఈ మాటలతో ఒకప్పుడు ఎన్ని సినిమాల్లో నటించినా కూడా ప్రస్తుతం నటించే సత్తా లేకపోతే సినిమా పరిశ్రమలో ఆ యాక్టర్ పరిస్థితి మరి ఇంత బాడ్ గా ఉంటుందా అని అందరు అనుకుంటున్నారు.

పావలా శ్యామల లేటెస్ట్ గా కూడా తన యాక్టింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించింది. మత్తు వదలరా మూవీ లో దొంగతనం చెయ్యబోయే హీరోని పావలా శ్యామల గట్టిగా వదలకుండా పట్టుకోవడం విపరీతమైన నవ్వుని తెప్పిస్తుంది.థియేటర్ లో ఆ సీన్ కి సీట్ లో నుంచి కిందపడి నవ్వని ప్రేక్షకుడు లేడు. అలాంటి ఎన్నో సినిమాల్లో పావలా శ్యామల ప్రేక్షకులని తన కామెడీ టైమింగ్ తో విపరీతంగా నవ్వించింది. ఆమె వాయిస్ కూడా ఆమెకి చాలా ప్లస్. అంతటి ఆమె కి ఏంటి ఈ పరిస్థితి అని చాలా మంది సినిమా అభిమానులు అలాగే సాధారణ ప్రజలు కూడా బాధపడుతున్నారు

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.